ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. స్వదేశంలో జరుగనున్న ఈ టోర్నీలో కప్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా అనుకుంటోంది. అయితే భారత్ ఆశలపై తాము నీళ్లు చల్లుతామంటున్నాడు ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.
క్రికెట్లో ఏ జట్టుకైనా వరల్డ్ కప్ గెలవాలనేది ఒక కల. టీమిండియాకు కూడా వన్డే ప్రపంచ కప్‌ను ఒడిసి పట్టాలనే డ్రీమ్ ఉండేది. దీన్ని తొలిసారి 1983లో కపిల్ డెవిల్స్ నిజం చేసింది. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు ఆ ప్రపంచ కప్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి.. ఛాంపియన్స్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ కల నెరవేరేందుకు రెండున్నర దశాబ్దాలకు పైనే సమయం పట్టింది. అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచ కప్‌ను 2011లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీమిండియా గెలుచుకుంది. అయితే 2003లోనే భారత్ కప్ గెలవాల్సింది. ఆ టోర్నీలో అద్భుతంగా ఆడుతూ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. దీంతో కప్ గెలవాలన్న కసి ఆటగాళ్లలో బాగా పెరిగింది.
2003 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిని భారత ప్లేయర్లతో పాటు జట్టు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా కప్ గెలవాలన్న కసి అందరిలోనూ పెరిగింది. ఈ వరల్డ్ కప్‌లో జట్టులో ప్రధాన భూమిక పోషించిన వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రాలు తర్వాతి ప్రపంచ కప్‌ల్లోనూ ఆడుతూ వచ్చారు. 2011లోనూ వీళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి వాళ్లు తమ కలను నిజం చేసుకున్నారు. ఫైనల్లో శ్రీలంకను ఓడించి కప్‌ను ఒడిసి పట్టారు. అయితే ఆ తర్వాత మళ్లీ టీమిండియా వరల్డ్ కప్ నెగ్గలేకపోయింది. ప్రతిసారి ఎన్నో ఆశలు, అంచనాలతో బరిలోకి దిగడం, ఒట్టి చేతులతో తిరిగి రావడం భారత్‌కు పరిపాటిగా మారింది. ఈ ఏడాది భారత గడ్డపై వన్డే ప్రపంచ కప్ జరగనుంది. వన్డే ఫార్మాట్లో బహుశా చివరి వరల్డ్ కప్ ఇదే అంటున్నారు.
ఈసారి ఎలాగైనా 2011లో మాదిరిగానే కప్‌ను నెగ్గాలని టీమిండియా అనుకుంటోంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం ఇది సాధ్యం కాదని అంటున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుతుందన్న మార్ష్.. ఆఖరి పోరులో మాత్రం ఆసీస్ చేతుల్లో టీమిండియాకు ఓటమి తప్పదన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసి 450 రన్స్ చేస్తుందని.. ఛేదనలో భారత్ 65 రన్స్‌కే చాప చుట్టేస్తుందని మార్ష్ జోస్యం చెప్పాడు. ఇన్‌డైరెక్టుగా 2003 వరల్డ్ కప్ ఫైనల్ ఫలితం రిపీట్ అవుతుందని ఢిల్లీ క్యాపిటల్స్ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. అయితే మార్ష్ జోస్యంపై భారత ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈసారి కప్ ఇండియాదేనని.. కంగారూలను భారత్ చిత్తుగా ఓడిస్తుందని అంటున్నారు. మరి.. మార్ష్ జోస్యంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mitchell Marsh makes a BOLD PREDICTION for World Cup 2023 final 😅
(via Delhi Capitals podcast)#MitchllMarsh #WorldCupFinal pic.twitter.com/ipxupOiDJM
— CricTracker (@Cricketracker) May 9, 2023