ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జులై 29న జరిగిన తొలి మ్యాచ్‌ను గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ జట్టుకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయకుండా.. ఒక ఓవర్ తక్కువగా వేసినందుకు కరేబియన్ ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఈ ఆంక్షలు విధించారు. ఇద్దరు ఆన్ ఫీల్డ్ అంపైర్లు సైతం స్లో ఓవర్ రేట్‌పై రిఫరికీ కంప్లైయింట్ కూడా చేశారు.
ఇక తమ కారణంగా స్లో ఓవర్ రేట్ జరిగిందని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే విండీస్‌కు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2(22) ప్రకారం… ఓ జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయడంలో విఫలమైతే.. అదనంగా ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానా పడుతుంది. అందువల్ల వెస్టిండీస్ జట్టు ప్లేయర్లందరికీ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత పడింది. ఇక ఐదు టీ20ల్లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ సోమవారం జరగనుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
West Indies fined 20 per cent of match fee for slow over-rate in T20I vs India https://t.co/UPykiyyouN pic.twitter.com/mv02Vpxa1i
— seattleindian (@seattleindian) July 31, 2022
ఇది కూడా చదవండి: కామన్వెల్త్‌లో భారత జట్టు క్రికెటర్ల హెల్మెట్లపై BCCI లోగో ఎందుకు లేదో తెలుసా?