కామన్వెల్త్ గేమ్స్‌లో చాలా కాలం తర్వాత క్రికెట్ పోటీలను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఉమెన్స్ టీ20 మ్యాచ్‌లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ గేమ్స్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ కూడా ఆడేసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ పోటీల్లో భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ధరించే జెర్సీ కాకుండా ప్రత్యేకమైన జెర్సీ ధరించింది. అలాగే జెర్సీపై కానీ, హెల్మెట్‌పై కానీ ఎప్పుడూ ఉండే బీసీసీఐ లోగో లేదు. హెల్మెట్‌పై భారత జాతీయ జెండాను ధరించారు. ఈ విషయంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇండియన్ క్రికెటర్ల హెల్మెట్‌పై బీసీసీఐ లోగో లేకపోవడానికి ఒక కారణం ఉంది. నిజానికి బీసీసీఐ అనేక ఒక ప్రైవేట్ బోర్డు. దానిపై భారత ప్రభుత్వానికి పూర్తిస్థాయి కంట్రోల్ లేదు. నిజానికి ప్రస్తుతం బీసీసీఐ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న జట్టు భారత దేశానికి అధికారిక ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు కాదు. అదో ప్రైవేట్ టీమ్ అంతే. కానీ.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆయా దేశాల అధికారిక జట్లు మాత్రమే పోటీ చేయాలి. బీసీసీఐ లాంటి ప్రైవేట్ బోర్డులు పోటీ చేసేందుకు వీలులేదు. అందుకే బీసీసీఐ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న ఉమెన్స్ టీమ్‌తోనే భారత్ కామన్వెల్త్ పోటీల్లో పాల్గొంటుంది. అందుకే జెర్సీపై, హెల్మెట్‌పై బీసీసీఐ లోగో అనేది ఉండదు. అందుకే టీమిండియా ఉమెన్స్, మెన్స్ టీమ్‌కు మెయిన్ స్పాన్సర్‌గా ఉన్న బైజూస్ కాకుండా.. కామన్వెల్త్లో ఇండియన్ ఉమెన్స్ టీమ్‌కు జేఎస్‌డబ్ల్యూ జెర్సీ స్పాన్సర్‌గా ఉంది. చాలా కాలం తర్వాత భారతదేశం తరపున ఒక అధికారక జట్టు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుంది. మరి ఈ పోటీల్లో టీమిండియా గోల్డ్ మెడల్ గెలవాలని దేశం మొత్తం ఆకాంక్షిస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి. India vs Pakistan Commonwealth Games 2022 Live Streaming: When and where to watch IND W vs PAK W https://t.co/tWZxhdKjS3 — Hindustan Times (@HindustanTimes) July 31, 2022