ఐపీఎల్ తాజా సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని జట్లు కూడా ఈసారి ఎలాగైనా కప్ కొట్టేయాలనేంత కసిగా ప్రాక్టీసు చేస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ సీజన్ తోనైనా తమ అదృష్టాన్ని మార్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్ జట్టు బలాలు, బలహీనతలు ఏంటనేది ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్ కొత్త సీజన్ కు అంతా రెడీ. అన్ని జట్లు బాగా ఆడేయాలి, కప్ కొట్టేయాలి అని పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకుంటున్నాయి. గత సీజన్లలో మిస్ అయింది కానీ ఈసారి మాత్రం కప్ కొట్టాల్సిందే అని ఫిక్సయిపోతున్నాయి. తమ బలాబలాలు తెలుసుకుని.. ప్రత్యర్థి జట్ల ప్లాన్స్ కు చెక్ పెట్టేందుకు రెడీ అయిపోతున్నాయి. ఈసారి కూడా పది జట్లు కప్ కోసం పోటీపడబోతున్నాయి. అందరూ అనుకున్నట్లు చెన్నై, ముంబయితోపాటు బెంగళూరు జట్టుపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ పంజాబ్ కింగ్స్ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఆ జట్టు వ్యధ వర్ణనాతీతం. క్రికెట్ ప్రేమికులు ప్రతి ఒక్కరూ ఈ జట్టుని చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రస్తుతం ఏం జరుగుతోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ లో అన్ని జట్లు ప్రతి సీజన్ లో కప్ కొట్టకపోవచ్చు. కానీ ఓ సీజన్ కాకపోతే మరో సీజన్ లో అయినా కనీసం నాకౌట్ దశకు అయినా వెళ్తుంటాయి. ఈ జర్నీలో చాలా జట్లు సక్సెస్ అయితే, కొన్ని మాత్రం ఘోరంగా ఫెయిలవుతూ ఉంటాయి. ప్రతి సీజన్ లోనూ విఫలమవుతున్న జట్లలో పంజాబ్ కింగ్స్ టాప్ లో ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభంలో యువరాజ్ సింగ్ కెప్టెన్ గా ఉన్న కొన్ని సీజన్లు.. ఈ జట్టు బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. మధ్యలో 2014లో ఓసారి ఫైనల్ వరకు వెళ్లింది. కానీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ప్రతిసారి టోర్నీలో ఏదో ఆడుతున్నాం అంటే ఆడుతున్నాం అనేలా ఉంది. మరి ప్రస్తుతం పంజాబ్ జట్టు బలాలు బలహీనతలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
బ్యాటింగ్..
ఈసారి పంజాబ్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ ని నియమించారు. ఇతడు ఓపెనర్ కూడా కావడం ప్లస్ పాయింట్. ధావన్ తోపాటు భానుక రాజపక్స, షారుక్ ఖాన్ లాంటి బ్యాటర్స్ జట్టులో ఉన్నారు. సామ్ కరన్, లివింగ్ స్టన్, రిషి ధావన్, సికందర్ రజా లాంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. వీళ్లు బంతితో ఎలా అయితే మెప్పిస్తారో.. అదే టైంలో బ్యాటుతో ఆకట్టుకోవాలి. లేదంటే పంజాబ్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. ధావన్ మినహా చెప్పుకోదగ్గ స్టార్ బ్యాటర్ లేకపోవడం పంజాబ్ కు పెద్ద మైనస్. మరి చూడాలి బ్యాటింగ్ పరంగా ఎలాంటి ప్లానింగ్ తో బరిలో దిగుతుందో అనేది?
బౌలింగ్..
పంజాబ్ బౌలింగ్ పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. అర్షదీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్ లాంటి స్టార్ బౌలర్లు ఏ మాత్రం తలుచుకున్నాసరే ప్రత్యర్థి జట్టుని ముప్పతిప్పలు పెట్టగలరు. వీళ్లకు సామ్ కరన్, లివింగ్ స్టన్, రిషి ధావన్ లాంటి ఆల్ రౌండర్ల నుంచి సహకారం అందితే పంజాబ్ జట్టు బౌలింగ్ విషయంలో అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంది. అయితే పంజాబ్ జట్టులో బౌలర్లు స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ.. వారికి సరైన ప్లానింగ్ ఉంటేనే అద్భుతాలు చేయగలరు. లేదంటే టాలెంట్ ఉండి ప్రయోజనం లేకుండా పోతుంది.
బలం-బలహీనతలు..
ఐపీఎల్ తాజా సీజన్ లో పంజాబ్ కింగ్స్ బలం అని చెప్పుకోవడానికి మా వరకు అయితే ఒక్క కారణం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన సీజన్లలో 2008 సెమీస్, 2014 ఫైనల్ తప్పితే చెప్పుకోదగ్గ ఫెర్ఫార్మెన్స్ ఒక్కసారైనా ఇవ్వలేకపోయింది. సరైన ప్లానింగ్ లేకపోవడం, ప్రతి ఏడాది ఆటగాళ్లు, కోచ్ లను మార్చుతూ ఉండటం పంజాబ్ కు చాలా పెద్ద మైనస్. జట్టులో ఇలా ఎప్పటికప్పుడు చేసే మార్పుల కారణంగా.. అభిమానించే ప్రేక్షకులకు కూడా కెప్టెన్ ఎవరు? ఆటగాళ్లు ఎవరనేది సరిగా గుర్తుండదు. గత తొమ్మిదేళ్ల నుంచి ప్లేఆఫ్స్ కోసం కాదు.. చివరిస్థానాల కోసం పోటీపడుతుందా అనేలా పంజాబ్ ఆడుతోంది. మరి ఈసారైనా తన తలరాతని మార్చుకుంటుందా? లేదా ఎప్పటిలానే టోర్నీలో చతికిలపడుతుందా అనేది చూడాలి? మరి పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుత పరిస్థితిని చూసి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Behind the s̶c̶e̶n̶e̶s̶ Singhs! 🕺🤩#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/YDCw51gLrR
— Punjab Kings (@PunjabKingsIPL) March 29, 2023