పటిష్టమైన సౌతాఫ్రికాను టీమిండియా బౌలర్లు వణికించేశారు. డికాక్ 1, బావుమా 0, రిలీ రోసోవ్ 0, మిల్లర్ 0, ట్రిస్టన్ స్టబ్స్ 0 ఇలా వచ్చిన వారిని వచ్చినట్టే వెనుక్కు పంపి.. కొద్దిసేపు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా చేశారు. ఇప్పుడే క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పసికూనను వణికించినట్లు సౌతాఫ్రికా టాపార్డర్‌ను చిత్తుచిత్తు చేశారు. బుమ్రా, భువీ లేని టీమిండియా బౌలింగ్ ఎటాక్ ప్రొటీస్ బ్యాటింగ్ లైనప్‌ను చావుదెబ్బకొట్టింది. కొంత విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన యువ పేసర్ అర్షదీప్ సింగ్ అయితే అద్భుతమే చేశాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు. పిచ్ అందించిన సహకారంతో బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ వికెట్లను టపాటపా కూల్చాడు. చివరల్లో సౌతాఫ్రికా బౌలర్లు కొంత పోరాటం చేసి స్కోర్‌ను వంద దాటించారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా తొలుత ఇబ్బంది పడ్డా.. మిస్టర్ 360 పిచ్‌తో మనకు సంబంధంలేదు అంటూ ప్రొటీస్ బౌలర్లపై విరుచుకుపడి.. టీమిండియాను గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ బౌలింగ్ అనుకూలంగా ఉండటంతో భారత్ యువ పేసర్లు అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తొలి ఓవర్ చివరి బంతికి సౌతాఫ్రికా కెప్టెన్ బావుమాను దీపక్ చాహర్ అద్భుతమైన డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక్కడి నుంచి ప్రొటీస్ పతనం ఆరంభమైంది. రెండో ఓవర్ వేసిన అర్షదీప్ సంచలనం సృష్టించాడు. రెండో బంతికి క్వింటన్ డికాక్, ఐదో బంతికి రోసోవ్, చివరి బంతికి మిల్లర్‌ను అవుట్ చేసి సౌతాఫ్రికాకు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా మిల్లర్‌కు వేసిన బంతి మాత్రం అద్భుతమనే చెప్పాలి. బ్యాట్, ప్యాడ్ మధ్య స్వింగ్ అవుతూ మిడిల్ వికెట్‌ను బంతి గిరాటేసింది. ఈ ఒక్క బాల్ చాలా అర్షదీప్ టాలెంట్ ఏంటో చెప్పడానికి. ఇక మూడో ఓవర్‌లో దీపక్ చాహర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
బౌలింగ్ ఆల్‌రౌండర్ పార్నెల్‌తో కలిసి సీనియర్ ప్లేయర్ మార్కరమ్ కొద్ది సేపు వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 పరుగులు చేసిన మార్కరమ్‌ను హర్షల్ పటేల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ త్వరగానే ముగిసిపోతుందని అనుకుంటే.. అలా జరగలేదు. పార్నల్‌తో కలిసి స్పిన్నర్ కేశవ్ మహారాజ్ విరోచిత పోరాటం చేశాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి సౌతాఫ్రికాకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. చివరి ఓవర్ తొలి బంతికి హర్షల్‌పటేల్ స్లో యార్కర్‌తో కేశవ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో అతని పోరాటం ముగిసింది. 50, 60 పరుగులకే పరిమితం అవుతుందనుకున్న సౌతాఫ్రికా కేశవ్ దయతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది.
ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాను సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా ఇబ్బంది పెట్టాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్‌కు పరుగులు చేసేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే తన రెండో ఓవర్ రెండో బంతికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ కూడా 7వ ఓవర్ తొలి బంతికి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో టీమిండియా కూడా సౌతాఫ్రికా బాటలోనే వెళ్తున్నట్లు కనిపించింది. కానీ.. తర్వాత క్రీజ్‌లోకి మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వచ్చిరావడంతోనే రెండు సిక్సులతో ఎదురుదాటికి దిగాడు. ఒకవైపు కేఎల్ రాహుల్ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతుంటే సూర్య మాత్రం ఫ్రీగా బ్యాటింగ్ చేశాడు. సూర్యను చూసి కొంత ధైర్యం తెచ్చుకున్న రాహుల్ కూడా భారీ షాట్లు ఆడాడు. రాహుల్ కొంత సమయం తీసుకున్నా.. మరో వికెట్ పడకుండా టీమిండియాకు విజయం అందించాడు. సూర్యకుమార్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 50, కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 51 పరుగులతో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ముగించారు. 107 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగి తేలారు. కానీ.. మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం అసలు ప్రాక్టీస్ చేయలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో చెమలు చిందించి మ్యాచ్‌లో విఫలమైతే.. సూర్య మాత్రం అదరగొట్టాడు. మ్యాచ్‌కు ముందు రోజు బీసీసీఐ విడుదల చేసిన ఒక వీడియోలో టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలారు. కానీ.. ఆ వీడియలో సూర్యకుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. పైగా ఈ పిచ్‌పై ఇటు సౌతాఫ్రికా బ్యాటర్లతో పాటు రోహిత్, రాహుల్, కింగ్ కోహ్లీ ఇబ్బంది పడ్డా.. సూర్య మాత్రం తనకు తెలిసిన ఎటాకింగ్‌ప్లేతో సక్సెస్ అయ్యాడు.
GAME DAY 💪🏻💪🏻
All set for the first T20I in Thiruvananthapuram#TeamIndia | #INDvSA pic.twitter.com/DAb2lks2Ry
— BCCI (@BCCI) September 28, 2022
Good outing tonight 🇮🇳
An all round team effort 🙌🔥 pic.twitter.com/hS7b6rbD9y— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2022
The Best T20I Player !
Surya Kumar Yadav !#SuryakumarYadav#Sky#INDvsSA#KLRahulpic.twitter.com/kPoZNb1nvT— Mufaddal Vohra (@ImRohanSharma45) September 28, 2022
ఇది కూడా చదవండి: విమర్శకులకు బాల్ తోనే సమాధానం చెప్పిన అర్షదీప్.. ఒకే ఓవర్ లో 3 కీలక వికెట్లు!