కళ్లముందు 187 పరుగుల భారీ టార్గెట్.. పిచ్‌లో అనూహ్యమైన మార్పు. బౌన్స్ అవుతుంది ఇంకేముందు ఆసీస్ బౌలర్లకు పండగే. మ్యాచ్ ఉప్పల్‌లో జరుగుతున్నా ఆస్ట్రేలియాలో ఆడుతున్నట్లు అనిపించింది. అందుకు తగ్గట్లే ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను ఆసీస్ బౌలర్లు త్వరగానే పెవిలియన్ చేర్చారు. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో 30 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోవడంతో సిరీస్ దక్కదేమో అనిపించింది. కానీ.. చేజ్ మాస్టర్, మిస్టర్ 360 టీమిండియాను ఆదుకున్నారు. ఆసీస్ బౌలర్లను ఒకటాడుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కింగ్ కోహ్లీ తన క్లాస్‌తో ఆకట్టుకుంటే సూర్య తన స్టైల్లో మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. విజయానికి దగ్గరగా వచ్చి సూర్య అవుటైనా.. హార్దిక్ పాండ్యాతో కలిసి మిగతా పని పూర్తి చేశాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీ విజయానికి అడుగు దూరంలో అవుటైనా.. పాండ్యా విన్నింగ్ షాట్‌తో సిరీస్ భారత్ వశమైంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ చెలరేగి ఆడింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తూ.. 2-1తో మూడు టీ20ల సిరీస్‌ను కైవలం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఓపెనర్ గ్రీన్ ఆ జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి పవర్‌ప్లేలో దుమ్మురేపాడు. గ్రీన్ అవుట్ అయ్యేసరికి ఆసీస్ స్కోర్ 62 అందులో గ్రీన్ చేసినవే 52. మరో ఓపెనర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కేవలం 7 పరుగులు చేసి త్వరగానే అవుట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మరోసారి ఫించ్‌ను బుట్టలో వేసుకున్నాడు.
పవర్‌ప్లే తర్వాత తుస్సుమన్న ఆసీస్..
పవర్‌ప్లేలో గ్రీన్ అద్భుత బ్యాటింగ్‌తో ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా 6 ఓవర్ల తర్వాత డీలా పడింది. భారత్ బౌలర్లు చెలరేగడంతో వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్(9)ను చాహల్ అవుట్ చేయగా.. అద్భుత రనౌట్‌తో అక్షర్ పటేల్ మ్యాక్స్‌వెల్(7)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్(24), మ్యాథ్యూ వేడ్(1)లను అక్షర్ అవుట్ చేశాడు. దీంతో 117 పరుగులకే ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. పవర్ ప్లే పటిష్టంగా కనిపించిన ఆసీస్ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ.. చివర్లో టిమ్ డేవిడ్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52), డానియల్ సామ్స్(28) పరుగులతో ఆదుకోవడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, భువీ, చాహల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు వికెట్ దక్కగపోగా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
కోహ్లీ, సూర్య షో..
187 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(17) వికెట్లను త్వరగా కోల్పోయింది. కానీ.. చేజ్ మాస్టర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు), మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు) అద్భుతంగా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు. కోహ్లీ తన క్లాస్ చేజ్ టాలెంట్‌ను మరోసారి చూపిస్తూ.. అద్భుతమైన షాట్లతో రెచ్చిపోగా.. సూర్య తన మాస్ 360 డిగ్రీ బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. ఇద్దరు 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు సిరీస్ విజయాన్ని ఖాయం చేశారు. 14వ ఓవర్ చివరి బంతికి హెజల్‌వుడ్ బౌలింగ్‌లో సూర్య ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైనా.. హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 రన్స్ నాటౌట్)తో కలిసి కోహ్లీ టీమిండియాను గెలుపు అంచులకు చేర్చి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్ 5వ బంతికి పాండ్యా ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో మ్యాచ్‌తో పాట్ 2-1 తేడాతో సిరీస్‌ను సైతం గెలుచుకుంది. ఇక ఆసీస్ బౌలర్ల డెనియల్ సామ్స్ 2, హెజల్‌వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝐂. 𝐇. 𝐀. 𝐌. 𝐏. 𝐈. 𝐎. 𝐍. 𝐒 🏆#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/5yk3bRnHiV
— BCCI (@BCCI) September 25, 2022
Winners Are Grinners! ☺️ ☺️
That moment when #TeamIndia Captain @ImRo45 received the #INDvAUS @mastercardindia T20I series trophy 🏆 from the hands of Mr. @ThakurArunS, Treasurer, BCCI. 👏 👏 pic.twitter.com/nr31xBrRBQ
— BCCI (@BCCI) September 25, 2022
For his breathtaking batting display in the chase, @surya_14kumar bags the Player of the Match award. 👏 👏
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/YrvpUyDTxt
— BCCI (@BCCI) September 25, 2022
🗨️🗨️ I am enjoying my process at the moment: @imVkohli
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/7JlLTyDj6y
— BCCI (@BCCI) September 25, 2022
M. O. O. D as #TeamIndia beat Australia in the third #INDvAUS T20I & seal the series win. 👍 👍
Scorecard ▶️ https://t.co/xVrzo737YV pic.twitter.com/uYBXd5GhXm
— BCCI (@BCCI) September 25, 2022
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/FLvsIGc9sg
— BCCI (@BCCI) September 25, 2022
ఇది కూడా చదవండి: టీమిండియానే ప్రపంచకప్ విజేత.. లైవ్ లో కన్ఫర్మ్ చేసిన ధోనీ!