మహేంద్ సింగ్ ధోనీ అనే పేరుకు క్రికెట్ లో పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే జార్ఖండ్ డైనమైట్, మిస్టర్ కూల్, ద ఫినిషర్.. ఇలా ఎన్నో విధాలుగా ఫేమ్ అభిమానుల మనసుల్లో ఎప్పటికీ చెరిగిపోని స్థానం సంపాదించాడు. టీమిండియాకు కెప్టెన్ గానూ ఎన్నో ఘనతల్ని సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున మాత్రమే ఆడుతున్నాడు. అలాంటి ధోనీ.. ఫేస్ బుక్ లైవ్ లోకి వస్తాను. ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెబుతాననేసరికి.. ఫ్యాన్స్ అందరూ తెగ సంబరపడిపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో ధోనీ అస్సలు కనిపించడు. ఒకవేళ ధోనీ గురించి ఏమైనా అప్ డేట్స్ ఉంటే అతడి భార్య సాక్షినే.. వాటిని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటిది శనివారం ధోనీ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ కనిపించింది. ‘రేపు అంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ లోకి వస్తాను. మీకో ఇంట్రెస్టింగ్ విషయం చెబుతాను’ అని ధోనీ తన పోస్టులో పేర్కొన్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్… కొంపదీసి ధోనీ ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడా? టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాకు మెంటార్ గా వ్యవహరిస్తాడా? అని మాట్లాడుకున్నారు.
కట్ చేస్తే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలైంది. ధోనీ లైవ్ లోకి వచ్చాడు. ఏం చెబుతాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ని… చాలా నిరాశపరిచాడు. ఓ బిస్కెట్ కంపెనీ ప్రచారం కోసమే ఈ లైవ్ అని తెలిసి అభిమానులు నిరుత్సాహపడ్డారు. విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు మాట్లాడుతూ.. ‘ఓరియో 2011లో మన దేశంలోకి వచ్చినప్పుడు, టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు ఆ కుకీస్ ని మళ్లీ ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు కూడా భారత్ వరల్డ్ కప్ గెలుస్తుంది’ అని ధోనీ జోస్యం చెప్పాడు. కప్ గెలుస్తుందని ఏకంగా ధోనీనే చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. మరి ధోనీ, టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Dhoni says “India will win the T20 WC 2022”#Dhoni #T20WorldCup2022 pic.twitter.com/jQKZRHMf2p
— Attend (@needumjan) September 25, 2022
ఇదీ చదవండి: ఆసియా కప్ గెలవడంలో ధోనీదే కీలక పాత్ర! శ్రీలంక కెప్టెన్ చెప్పిన నిజాలు!