అతడు నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తినడానికి తిండి, ఉండటానికి సరైన వసతి లేదు. కానీ క్రికెట్ అంటే మాత్రం ప్రాణం పెట్టేవాడు. 9వ తరగతిలో ఫెయిలయ్యాడు. కానీ ఇంగ్లీష్ ని మాత్రం వదల్లేదు. ఆ భాష అంటే నీకు ఎందుకిష్టం అని ఎవరైనా అడిగితే.. రేప్పొద్దున గొప్పవాడిని అయితే ఇంగ్లీష్ లోనే ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అనేవాడు. ఇది ఆత్మవిశ్వాసం అంటే.. అదే అతడిని నిలబెట్టింది. ఇప్పుడు ప్రపంచం మెచ్చే క్రికెటర్ ని చేసింది. పైన ఫొటోలో కనిపిస్తున్న పిల్లల్లో ఒకడు.. ప్రస్తుతం స్టార్ క్రికెటర్. ఎవరో గుర్తుపట్టారా మరి?
ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో ఉన్నది టీమిండియాకు ఆడుతూ చాలా ఫేమ్ తెచ్చుకున్న పాండ్య బ్రదర్స్. దిగువన కూర్చున్నది హార్దిక్ పాండ్య.. అమ్మనాన్న వెనకాల నిల్చుచున్నది కృనాల్ పాండ్య. తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా కృనాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫొటోని పోస్ట్ చేశారు. ఇకపోతేై ‘పేదవాడిలా పుట్టడం మన తప్పు కాదు.. పేదవాడిగా చనిపోతే మాత్రం అది కచ్చితంగా మన తప్పే’ అని వారెన్ బఫెట్ చెప్పారు. దాన్ని అక్షరాలా హార్దిక్ పాండ్య నిజం చేసి చూపించాడు. ఎందుకంటే తినడానికి తిండే లేని ఓ కుర్రాడు.. క్రికెట్ కోసం ప్రాణం ఇచ్చేంతలా కష్టపడ్డాడు. ఓ ఏడాదిపాటు ఐదు రూపాయల మ్యాగీతోనే కడుపు నింపుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం క్రికెట్ ఆడాడు.. ఇప్పుడు అదే ఆట.. హార్దిక్ పాండ్యాని కోటిశ్వరుడిని చేసింది. ఇతడి లగ్జరీ లైఫ్ చూసి మిగతా క్రికెటర్లు కూడా కుళ్లుకుంటారేమో! అంత సూపర్ లైఫ్ మనోడిది!
Happy birthday bachhu ❤️❤️❤️❤️ I love you! There is no one like you. Keep believing. Keep inspiring everyone and just remember, I will always have your back 🤗🤗😘 @hardikpandya7 pic.twitter.com/521civgF5S
— Krunal Pandya (@krunalpandya24) October 10, 2022
ఇక హార్దిక్ కెరీర్ విషయానికొస్తే.. 2015లో ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టుకి ఆడాడు. తొలి సీజన్ తోనే తన మార్క్ చూపించాడు. దీంతో ఏడాదిలోపు టీమిండియాకు ఆడతావ్ అని సచిన్ చెప్పాడు. మాస్టర్ చెప్పినట్లే భారత జట్టులోకి హార్దిక్ అడుగుపెట్టాడు. ఐపీఎల్ టోర్నీలో అదరగొట్టినప్పుటికీ జాతీయ జట్టులో అప్పుడప్పుడు అదరగొట్టేవాడు. దీంతో జట్టులోకి వస్తూపోయాడు. ఇక గతేడాది నటి, మోడల్ నటాషాతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు అగస్త్య అనే కొడుకు పుట్టాడు. ఇక తండ్రి అయిన తర్వాత హార్దిక్ ఆటలో పరిణితి కనిపించింది. ఐపీఎల్ లో అయితే గుజరాత్ జట్టుకు కెప్టెన్సీ చేసి తొలి ఏడాది కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అక్కడే పుట్టినరోజు వేడుకల్ని కూడా చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ గా మారాయి. మరి హార్దిక్ పాండ్య చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Happy birthday Hardik bhai ❤️🥳
Next Indian captain 😌@hardikpandya7
@imVkohli pic.twitter.com/lY3DyFoxaR— MORTHI P (@morthi_p) October 11, 2022
K L Rahul wishes a very happy birthday to best friend Hardik Pandya. Happy birthday Hardik Sir on behalf of all K L Rahul fans. ♥️🤟🏻@hardikpandya7 • #HappyBirthdayHardik pic.twitter.com/S5AJyRWFKY
— Juman Sarma (@cool_rahulfan) October 11, 2022
Happy Birthday Hardik Pandya, one of the finest all-rounders of this generation, IPL winning captain, 226 runs & 10 wickets in 2019 ODI World Cup, 400+ runs in IPL 2019 & IPL 2022, player of the match in IPL 2022 final & five-wicket at Trent Bridge in Tests. pic.twitter.com/U2PPP8KMhd
— 🇮🇳 Sumer veera Viratian 18💙 (@SumerViratian) October 11, 2022
Happy Birthday Hardik Pandya 💙
– Only Indian with 1000 runs + 110 SR in ODI
– Most T20I sixes for India in the death overs
– Only Indian to Pick 4fer in all formats in England
– Only Indian to Score 500 runs & pick 50 Wickets in T20I format
(1/n) pic.twitter.com/oYNwCiJZ7e
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 11, 2022