ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరంటే అందరూ చేప్పే పేరు ఎంఎస్ ధోని. అతని కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా అత్యుత్తమ కప్పులన్నీ టీమిండియా ధోని కెప్టెన్సీలో కొట్టింది. విజయాలు, రికార్డులేకాక తన వ్యక్తిత్వం, నిరాడంబరతతో ధోని ఇండియన్ క్రికెట్‌లో చెరగని ముద్రవేశాడు. అతని తర్వాత వచ్చిన కెప్టెన్లు కూడా కొన్ని విషయాల్లో ధోనిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది.
తాజాగా టీమిండియా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో క్లీన్ స్వీప్ చేసింది. కుర్రాళ్లతో నిండిన జట్టును పాండ్యా అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని సిరీస్ విజయంతో ప్రారంభించాడు. మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో కెప్టెన్‌గా కప్పును అందుకున్న పాండ్యా.. ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అద్భుత బౌలింగ్‌తో రాణించిన యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు కప్ అందించి అతనికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్‌కు పాండ్యా కప్ అందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యా ఎంతో పరిణితి చెందాడండూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
గతంలో ధోని కూడా ఇలానే సిరీస్‌లు గెలిచి ట్రోఫీలను యువ క్రికెటర్ల చేతుల్లో పెట్టి వారికి మధురానుభూతి ఇచ్చేవాడు. ఇప్పుడు హార్థిక్ పాండ్యా కూడా ధోనిని ఫాలో అవుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మంచి స్వీకరించడంతో తప్పులేదని పాండ్యా కూడా ధోని అంత గొప్ప కెప్టెన్ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. కెప్టెన్‌గా ధోని పట్టిందల్లా బంగారంలా ఉండేది.. ఇప్పుడు పాండ్యా విషయంలో కూడా అలాగే జరుగుతోంది. ఐపీఎల్‌లో తొలి సారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి ఒక కొత్త జట్టును ఏకంగా ఐపీఎల్ విజేతగా నిలిపాడు. వెంటనే కెప్టెన్‌గా టీమిండియాకు సిరీస్ విజయం అందించాడు. దీన్ని బట్టి ధోనితో పోయిన అదృష్టం.. తిరిగి హార్థిక్ పాండ్యాతో వచ్చినట్లు ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. హార్థిక్ పాండ్యా టీమిండియాలో మరో ధోని అయిపోయాడని.. అందుకే హార్థిక్ పాండ్యాను టీమిండియా టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌ని చేస్తే.. అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ మనదే అవుతుందని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Hardik Pandya has handed over the trophy to Umran Malik. Such a beautiful picture ❤️#UmranMalik #HardikPandya pic.twitter.com/XA5hbKPhsI
— Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 28, 2022