ప్రస్తుతం టీమిండియాతో పాటు యావత్ క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ జరుగుతున్నా.. దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్ గురించే ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మళ్లీ ఆ కప్‌ను ముద్దాడలేదు. ఇప్పుడు మరోసారి ఆ కప్‌ను గెలిచే అవకాశం వచ్చింది. ఈ సారి ఎలాగైనా పొట్టి ప్రపంచ కప్‌ను గెలిచి 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా ఆటగాళ్లు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ ప్రారంభానికి రెండు వారాల ముందే ఆస్ట్రేలియా చేరుకుని అక్కడి పిచ్‌లపై ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నారు.
ఇంకా.. జట్టు విజయావకాశాలపై విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. బ్యాటింగ్ పరంగా టీమిండియా బలంగానే ఉన్నా.. బౌలింగ్ విషయమే ఆందోళన కలిగిస్తోంది. అందుకు కారణం ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కావడమే. కొత్త బంతితో వికెట్లు అందించడంతో పాటు.. డెత్ఓవర్స్లో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను నిలవరించడంలో బుమ్రా నంబర్ వన్ బౌలర్. అలాంటి బౌలర్ లేకుండా టీమిండియా వరల్డ్ కప్‌కు వెళ్లడంతో అందరిలోనూ ఒకింత ఆందోళన ఉంది. పైగా ఇప్పటి వరకు బుమ్రా స్థానాన్ని మరో బౌలర్‌తో భర్తీ చేయలేదు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, హర్షల్‌పటేల్ ఉన్నా.. ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఇదే విషయంపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ.. జస్ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ 2022కు దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బేనని అన్నారు. బుమ్రా జట్టులో లేకుంటే.. టీమిండియాను ప్రత్యర్థి జట్లు చూసే విధానం మారిపోతుందని, బుమ్రా బౌలింగ్ లేదనే సరికి వారి బ్యాటర్లలో ఒకింత ఆత్మవిశ్వాసం వచ్చి.. ధైర్యంగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని సంజయ్ అన్నారు. బుమ్రా జట్టులో లేకుంటే టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు చిన్న చూపు చూస్తారని అతని ఉద్ధేశం. కాగా.. బుమ్రా గాయంతో దూరమైనా.. అతని స్థానంలో మరో బౌలర్‌కు అవకాశం దక్కుతుందని, ఒకరి లాస్ మరొకరికి అవకాశం అని సంజయ్ అన్నారు. బుమ్రా లేకపోయినా.. అర్షదీప్ సింగ్‌పై ఆశలు పెట్టుకోవచ్చని, బుమ్రా స్థానంలో షమీ లేదా దీపక్ చాహర్ బెస్ట్ ఆప్షన్ అని అన్నాడు.
In #JaspritBumrah‘s absence, the rivals will see Indian bowling attack in a different light, according to former Indian cricket team batting coach Sanjay Bangar https://t.co/Cch7s6BdgP
— CricketNDTV (@CricketNDTV) October 11, 2022