రిషబ్ పంత్.. ‘భారత జట్టు భవిష్యత్తు ఆశాకిరణం..’ ఏడాది క్రితం పంత్ గురుంచి మాజీ ఆటగాళ్లు అన్న వ్యాఖ్యలివి. రాబోవుకాలంలో టీమిండియా ఫ్యూచర్ అతడేనంటూ సపోర్టివ్ వ్యాఖ్యలు చేశారు. అలాంటి పంత్, ఏడాదికే తన కెరీర్ ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. రాణించకపోవడం ఒకవైపు, ఆటగాళ్ల నుంచి పోటీ మరోవైపు.. దీన్ని తట్టుకోలేక ఒత్తిడిలో కురుకుపోతున్నాడట. దీంతో పంత్ కెరీర్ ముగిసినట్టేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి మనమంటున్న మాటలు కాదు.. పంత్ హేటర్స్ నుంచి వస్తున్న మాటలు.
డీకే జట్టులోకి తిరగి రాకముందు ధోనీ అంతటోడు అయ్యేలా కనిపించిన పంత్.. కొన్ని రోజులుగా జట్టులో స్థానం కూడా దక్కించుకోలేకపోతున్నాడు. డీకే జట్టులో ఫినిషర్‌గా ఉంటున్నా.. అతనికున్న కీపింగ్ టాలెంట్‌తో పంత్‌కు పక్కలో బళ్లెంలా తయారైయ్యాడు. దీంతో పంత్ కెరీర్ టీ20 ప్రపంచ కప్ లో అతడు ఏ మేరకు రాణిస్తాడు అన్న దానిపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి డీకే ఒక్కడినుంచే పోటీ ఉన్నా.. ఈ టోర్నీ ముగిశాక సంజూ సాంసన్, ఇషాన్ కిషన్ నుంచి తప్పక పోటీ ఉంటుంది. కనుక ఇకనైనా పంత్ కళ్లు తెరవాలని సూచిస్తున్నారు. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న పంత్, టీ20ఫార్మాట్‌లో మాత్రం తన సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. అందువల్ల అతను టీ20లకు సరిపోడంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Only Indian test wicket keeper to do This ….🥵💥 #RishabhPant#HappyBirthdayRishabh pic.twitter.com/PnEhTbpwAh
— Tarak JP 💥 (@tarak_jp_) October 3, 2022
పోనీ, టీ20లను వదిలేసి వన్డే, టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగుతాడులే అనుకున్నా.. అవి సుదీర్ఘ ఫార్మాట్లు కనుక ఎక్కువ రోజులు కొనసాగలేడు. అందులోనూ.. 2-3 మ్యాచుల్లో విఫలమైతే పక్కన పెట్టేస్తారు. దీంతో పంత్ కెరీర్ ఈ ఏడాదితో ముగిసినట్టే అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ ఏడాది 17 టీ20లు ఆడిన పంత్ 25.91 సగటుతో కేవలం 311 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల ఆసియా కప్ 2022లో మూడు ఇన్నింగ్స్‌లలో 51పరుగులు మాత్రమే చేసిన పంత్, స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జరిగిన టీ20 సిరీస్ ల్లోనూ పెద్దగా రాణించింది లేదు. వచ్చేదే అవకాశాలు అంతంత మాత్రం అంటే.. వాటిలోనూ అతడు విఫలమవుతూ తన కెరీర్ ను ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే ప్రపంచ కప్ పంత్ కెరీర్ ను ఏం చేయబోతుందో చూడాలి.
#SanjuSympathyFans bro if anyone questioned about Rishabh Pant performance in t20, reply this pic to them and consider all other next words from them as BARKS pic.twitter.com/QSX7m0UinE
— Rishabhians Planet (@Rishabhians17) October 8, 2022