ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా రెండో టీ20లో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. కంగారులను కంట్రోల్ చేయడంలో కాస్త పట్టుతప్పినట్లు అనిపించింది. 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేయడంతో అంతా మ్యాచ్ వన్ సైడ్ అయ్యిందని భావించారు. కానీ, రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో 4 బంతులు మిగిలుండగానే విక్టరీ నమోదు చేశారు. దినేష్ కార్తీక్ ఫినిషింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు. క్రెడిట్ మొత్తం మీరే తీసుకున్నారు అంటూ విలేకరులు అనగా.. అందుకు డీకే నవ్వుతూ.. “ నేను చేసింది ఏముంది. క్రెడిట్ నేనేమీ తీసుకోలేదు. లాస్ట్ లో వచ్చి రెండు బంతులు దొరికాయి ఆడాను. అది కూడా ఏదో అలా ట్రై చేశాను. కానీ, రోహిత్ శర్మ ఆడిన తీరు అందరినీ కట్టిపడేసింది. కొత్త బంతితో అలాంటి పిచ్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లను ఆయన ఎదుర్కొన్న తీరు ఆందరినీ ఆకట్టుకుంది. అందుకే రోహిత్ శర్మ అత్యుత్తమ ప్లేయర్ అయ్యాడు. కేవలం ఇండియన్ క్రికెట్‌లోనే కాదు వరల్డ్ క్రికెట్‌లో రోహిత్ శర్మ టాప్ క్లాస్ బ్యాటర్. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే టాలెంట్ మరే బ్యాటర్‌కు ఉండదనే చెప్పాలి” అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
WHAT. A. FINISH! 👍 👍
WHAT. A. WIN! 👏 👏@DineshKarthik goes 6 & 4 as #TeamIndia beat Australia in the second #INDvAUS T20I. 👌 👌@mastercardindia | @StarSportsIndia
Scorecard ▶️ https://t.co/LyNJTtkxVv pic.twitter.com/j6icoGdPrn
— BCCI (@BCCI) September 23, 2022
బ్యాటింగ్ ఆర్డర్ రిషబ్ పంత్ రావాల్సి ఉండగా.. కెప్టెన్ కాల్ ప్రకారం దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ విషయంపై దినేష్ కార్తీక్ విలేకరుల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. అసలు రిషబ్ పంత్ జట్టులో ఎందుకు ఉన్నాడు అంటూ డీకేని ప్రశ్నించారు. అందుకు దినేష్ కార్తీక్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. “వర్షం కారణంగా మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించారు. మాకు ఐదుగురు బౌలర్ల అవసరం లేకుండా పోయింది. అందుకే రిషబ్ పంత్‌ని తీసుకున్నారు. ఒకవేళ ఐదో బౌలర్ కావాల్సి వచ్చినా కూడా హార్దిక్ పాండ్యా రూపంలో మాకు అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా టీమ్‌ని సమతుల్యం చేయగలడు. రిషబ్ పంత్ కూడా టాప్ క్లాస్ బ్యాటర్ కాబట్టే జట్లో అవకాశం కల్పించారు” అటూం దినేష్ కార్తీక్ విలేకరుల ప్రశ్నకు గట్టి రిప్లై ఇచ్చాడు. దినేష్ కార్తీక్ సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.