నేటి ఆధునిక కాలంలో సోషల్ మీడియా వచ్చాక తమలో ఉన్న టాలెంట్ ను ప్రతీ ఒక్కరు బయటపెడుతున్నారు. ఇక టిక్ టాక్ వచ్చాక ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. డబ్ స్మాష్ లతో వీడియోల చేయడం సరదాగా మారిపోయింది. ఇక ఇదే కోవలోకి సెలబ్రిటీలు సైతం వచ్చారనడంలో అతిశయోక్తి లేదు. అయితే టీమిండియా స్టార్ క్రికెటర్ ధావన్.. అటు డ్రసింగ్స్ రూంలో.. ఇటు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. తనదైన డ్యాన్స్ లతో విన్నింగ్ సెలబ్రేషన్స్ ను టీమ్ ఆటగాళ్లతో కలిపి చేసుకుంటూంటాడు. దాంతో ఆ వీడియోలు తెగవెరల్ అవుతూంటాయి. ఈ క్రమంలోనే గబ్బర్, జడేజాలకు చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
శిఖర్ ధావన్.. క్రికెట్ అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుచుకుంటారు. అదీ కాక గ్రౌండ్ లో క్యాచ్ పడితే తొడ కొట్టి మీసం మెలేస్తాడు.. అది అతడి సిగ్నేచర్ స్టెప్. అతడి సిగ్నేచర్ స్టెప్ తెలియనని భారతీయులు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోవడంలో విఫలం అయిన ధావన్.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమి శిక్షణా కేంద్రంలో ఉన్నాడు. ఇక గాయం కారణంగా అక్కడే రిహాబిలిటేషన్ సెంటర్ లో జడేజా సైతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరు కలిశారు. అక్కడే ఓ సరదా సన్నివేశం జరిగింది. అదేంటంటే? గాయంతో బాధపడుతూ జడేజా ఉంటే.. ధావన్ మాత్రం మంచిగయ్యింది అన్నట్లు డ్యాన్స్ చేస్తున్నాడు. దాంతో జడేజా ఓ హిందీ డబ్బింగ్ డైలాగ్ ను డబ్ స్మాష్ ద్వారా చెప్పాడు. ధావన్ డ్యాన్స్ చూసిన జడేజా “వీడికి త్వరగా పెళ్లి చేయండి.. అప్పుడుగానీ వీడికి తిక్కకుదురుతుంది” అని అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోలో మాత్రం ధావన్ తన తీన్ మార్ డ్యాన్స్ తో అదరగొట్టాడనే చెప్పాలి. అయితే ధావన్ ఎక్కడుంటే.. అక్కడ ఫుల్ ఎనర్జీతో, డాన్స్ తో నవ్వులు పూయిస్తాడని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సారి తనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టాడు. టీ20 జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలం అయిన ఈ ఇద్దరు నేషనల్ క్రికెట్ అకాడమిలో ఉన్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ స్పందిస్తూ..”గబ్బర్ తో మామ్ములుగుండదు” అంటుంటే.. మరికొందరేమో..”గబ్బర్ ఏ మాత్రం మారలేదు. అదే జోష్.. అదే డాన్స్..” అంటూ రాసుకొచ్చారు. మరి శిఖర్ ధావన్ మాస్ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Never change, Gabbar 🤣@SDhawan25 @imjadeja pic.twitter.com/x9Tegt1FaU
— Circle of Cricket (@circleofcricket) September 24, 2022