దాదాపు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే పరిస్థితి నుంచి.. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సాధించాడు దినేష్ కార్తీక్. ధోని తర్వాత టీమిండియాలో అలానే ఉండిపోయిన ది ఫినిషర్ రోల్‌ను భర్తీ చేస్తూ.. టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో 7 బంతుల్లో 17 పరుగులు చేసి తన రోల్‌ను పర్ఫెక్ట్‌గా పోషించాడు. కానీ.. మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో డీకేకు అప్‌ది ఆర్డర్‌లో ప్రమోషన్ లభించింది. ఎప్పుడూ డెత్ ఓవర్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే డీకే.. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లోనే క్రీజ్‌లోకి వచ్చేశాడు. తొలి ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో ఓవర్ నాలుగో బంతికి వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో సూర్యకుమార్ కంటే ముందే డీకే బరిలోకి దిగాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దొరికి టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా.. డీకే స్టైల్ ఆఫ్ బ్యాటింగ్‌లో మాత్రం మార్పు రాలేదు. డెత్ ఓవర్స్ చేస్తున్నట్లే టాపార్డర్‌లోనూ చేశాడు. కేవలం 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు చేసి సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ.. భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా తనే నాశనం చేసుకున్నాడు. మంచి షాట్లతో పరుగులు వస్తున్నా.. అనవసరంగా రివర్స్ హిట్‌కు ప్రయత్నించి.. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినా కూడా డీకేనే టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డీకే మరికొంత సేపు బ్యాటింగ్ చేసి ఉంటే.. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసేవాడే. కానీ.. భారీ స్కోర్ ఛేదించే క్రమంలో వేగంగా ఆడుతూ.. అవుట్ అయ్యాడు.
ఇక మ్యాచ్‌లో దినేష్ కార్తీక్‌తో పాటు రిషభ్ పంత్‌కు కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ ప్రమోషన్ వచ్చింది. రోహిత్ రెగ్యులర్ పార్టనర్ కేఎల్ రాహుల్, వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లీలకు ఈ మ్యాచ్‌కు రెస్ట్ ఇవ్వడంతో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ పంత్‌కు వచ్చింది. కొన్ని రోజులుగా పరుగులు చేయలేక జట్టుకు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కనిపించాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 భారీ సిక్సులతో 27 పరుగులు చేసి.. మంచి టచ్‌లో కనిపించాడు. కానీ.. ఎన్గిడి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. కాగా.. శ్రేయస్ అవుట్ తర్వాత పంత్‌కు పార్టనర్‌గా దినేష్ కార్తీక్ వచ్చాడు.
ఇప్పటికే ఇద్దరి మధ్య ఫినిషర్ రోల్, వికెట్ కీపింగ్ విషయంలో తీవ్ర పోటీ ఉన్న విషయం తెలిసిందే. తన ఫినిషింగ్ స్కిల్స్‌తో డీకే ఇప్పటికే పంత్ ప్లేస్‌కు ఎసరుపెట్టాడు. పంత్, డీకే ఇద్దరిలో ఎవరంటే టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్, కెప్టెన్ కళ్లు మూసుకుని డీకేనే అంటున్నారు. ఈ క్రమంలో కనీసం టాపార్డర్‌లో అయినా మంచి పరుగులు చేసి సత్తా చాటుదాం అనుకున్న పంత్ ఆశలపై డీకేనే నీళ్లు చల్లాడు. తాను కూడా టాపార్డర్‌లో రావడంతో పాట్ పంత్ కంటే బెటర్ బ్యాటింగ్ చేశాడు. పంత్ 27 పరుగులు చేస్తే.. డీకే 46 రన్స్ చేశాడు. ఇలా ఫినిషర్ రోల్‌ను పంత్ నుంచి లాగేసుకున్న డీకే.. ఇప్పుడు టాపార్డర్‌లోనూ పంత్‌ను పక్కకునెట్టేశాడు.
The @DineshKarthik show 💥💥
46 runs
21 balls
4 Fours and as many Sixes!Talk about a quick-fire knock.
Live – https://t.co/dpI1gl5uwA #INDvSA @mastercardindia pic.twitter.com/6H4AyfdSiz
— BCCI (@BCCI) October 4, 2022
Rishabh Pant and Rohit Sharma opening for India. pic.twitter.com/M1bcHiyiHe
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2022
ఇది కూడా చదవండి: టీమిండియా బౌలర్లను చేతులు జోడించి ప్రాధేయపడ్డ రోహిత్ శర్మ!