టీమిండియా క్రికెటర్లు, హీరోయిన్స్ మధ్య బాండింగ్స్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఒకప్పటి స్టార్ క్రికెటర్ల నుంచి ఇప్పటి యువ క్రికెటర్ల వరకు చాలామంది రిలేషన్ షిప్స్ మెంటైన్ చేశారు. వారిలో కోహ్లీ లాంటి వాళ్లు ఒకరిద్దరు హీరోయిన్సే పెళ్లి కూడా చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ యువ క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్, ఫన్నీగా ఉంది. మొన్నటికి మొన్న పంత్ పై తెగ తిట్టుకున్న ఓ హీరోయిన్.. ఇప్పుడేమో పంత్ కి ఏకంగా ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ రెచ్చగొడుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ని బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా టార్గెట్ చేసింది. ఈ మధ్య జరిగిన ఆసియాకప్ కంటే ముందు ఓ ఇంటర్వ్యూలో పంత్ గురించి ఊర్వశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకానొక సందర్భంలో తన కోసం హోటల్ లాబీలో పంత్ చాలాసేపు ఎదురుచూశాడని చెప్పింది. బిజీ షెడ్యూల్ కారణంగా అలసిపోవడంతో నిద్రపోయానని, ఆ టైములో పంత్ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేకపోయానని తెలిపింది. ఇందులో ఊర్వశి, ఆర్పీ అనే క్రికెటర్ అని చెప్పింది గానీ ఎక్కడా కూడా పంత్ పేరు ప్రస్తావించలేదు.
ఇక ఇదే సమయంలో ఘాటుగా రియాక్ట్ అయిన పంత్.. ప్రచారం కోసం ఇలా కొంతమంది ఇతరుల పేర్లు వాడుకుంటున్నారని సోషల్ మీడియాలో ఊర్వశిని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ పెట్టాడు. దీంతో ఊర్వశి.. ‘చోటూ భయ్యా, వెళ్లి ఆడుకో’ అని సెటైరికల్ రిప్లై ఇచ్చింది. దీంతో ఆ వివాదం కాస్త అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పంత్ అక్కడితే ఆ గొడవ వదిలేసినా సరే ఊర్వశి, పదే పదే పంత్ ని అందులోకి లాగాలని చూస్తోంది. ఆసియాకప్ మ్యాచ్ లు చూడ్డాటానికి వెళ్లింది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత పంత్ కి సారీ చెప్పింది. ఒకటి రెండు రోజుల తర్వాత సారీ చెప్పింది పంత్ కి కాదు అని బుకాయించింది.
ఇప్పుడు ఏకంగా పంత్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ ఊర్వశి రౌతేలా ఇన్ స్టాలో గురువారం ఓ వీడియో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే అనే క్యాప్షన్ తో ఉన్న ఈ వీడియోలో.. హాట్ గా కనిపిస్తున్న ఊర్వశి.. ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ కనిపించింది. ఇది పంత్ కోసమేనని నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు పంత్ ప్రేయసి ఇషా నేగి ఇన్ స్టాలో పంత్ కి విషెస్ చెబుతూ స్టోరీ పెట్టింది. ఇదంతా చూస్తున్న నెటిజన్స్.. పంత్ చాలా లక్కీరా బాబు అని తెగ మాట్లాడుకుంటున్నారు. మరి పంత్ పై సెటైర్స్ వేసిన ఊర్వశి.. ఇప్పుడు కిస్ వీడియో పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.