Rishabh Pant vs Urvashi Rautela: రిషభ్ పంత్ – ఊర్వశి రౌటేలా.. వీరి మధ్య జరుగుతున్న గొడవ గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. యుద్ధమైనా ఆరు దాటితే ఆపుతారేమో కానీ, వీరి గొడవ మాత్రం 24 గంటలు సాగుతోంది. మైదానంలో పులిలా గాండ్రించే పంత్.. ఊర్వశి ముందు మాత్రం ఊరుకోవాల్సిన పరిస్థితి. నిన్నటికి నిన్న గొడవ సద్దుమణిగినట్లే కనిపించినా.. ఇవాళ మళ్ళీ మొదలైంది. కాకుంటే.. ఇక్కడ యుద్ధమంతా ఊర్వశి వైపు నుంచే నడుస్తోంది.
ముందుగా వీరి గొడవకు కారణమైన విషయం గురుంచి రెండు ముక్కల్లో.. రిషభ్ పంత్ తన కోసం హోటల్ గదిలో గంటల తరబడి వేచియున్నాడని.. అదంతా తనతో సె* చేయడానికే అని సంచలన ఆరోపణలు చేసిన ఊర్వశీ రౌటేటా.. ఆసియా కప్ ముందు సోషల్ మీడియా వేదికగా అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ ఆరోపణలపై స్పందించిన పంత్.. ‘పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా?’ అంటూ కౌంటరిచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఊర్వశీ.. చోటు భయ్యా! బ్యాట్ బాల్ ఆడుకో. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే వాడు) నీ ఇజ్జత్ తీస్తా’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. దాంతో మనోడు తనదైన శైలిలో ఎదో చిన్న కౌంటరిచ్చి ఊరుకున్నాడు. కానీ, ఆమె ఊరుకోలే.
ఇదంతా కొన్నిరోజుల క్రితం జరగగా, మంగళవారం(సెప్టెంబర్ 13) ఓ చానెల్‌తో ఊర్వశీ ముచ్చటించగా.. ‘మీరు పంత్‌కు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా..?’ అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. ‘ఏం చెప్దామనుకున్నా. నాకే తెలియడం లేదు. అయితే ఒక్క విషయం సారీ.. ఐయామ్ సారీ..’ అని రెండు చేతులు జోడించి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని అంతా భావించారు. కానీ ఈ బాలీవుడ్ బ్యూటీ మళ్లీ మాట మార్చి చిచ్చును రాజేసింది.
“తాను సారీ చెప్పింది పంత్‌కు కాదని.. తన ఫ్యాన్స్ కోసం అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ‘ఈ రోజుల్లో కొన్ని అధికారిక న్యూస్ ఆర్టికల్స్, మీమ్ పేజీల అడ్మిన్లు.. సినిమాలు, టీవీ షో ల కంటే ఎక్కువ డ్రామాను క్రియేట్ చేస్తున్నారు. నేను చెప్పిన సారీ నా ఫ్యాన్స్ కోసం.. నా ప్రియమైన వారికోసం.. అంతకుమించి ఏమీ లేదు..’ అని రాసుకొచ్చింది. దీంతో వీరిద్దరి పోరాటం ఇప్పట్లో ముగియదంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇదంతా.. ప్రేమకు ఆరంభమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.