బాబర్ అజమ్- హసన్ అలీ ఇద్దరూ అంతర్జాతీయ స్థాయిలో ఒకే జట్టుకు ఆడాతారు. కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వేర్వేరు జట్లకు ఆడుతుండటంతో వారి మధ్య ఇలాంటి సంఘటన జరిగింది.
పాకిస్థాన్ పేసర్ హసన్ అలీపై, పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాట్‌తో దాడి చేయబోయాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 8లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెషావర్ జల్మీ-ఇస్లామాబాద్ యూనైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పెషావర్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాబర్, హసన్ అలీని బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇస్లామాబాద్‌కు ఆడుతున్న హసన్.. బౌలింగ్‌లో సింగిల్ తీసిన బాబర్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకునే క్రమంలో అక్కడే నిలబడ్డ హసన్‌ను కొట్టేందుకు బ్యాట్ ఎత్తాడు. అది గమనించిన హసన్ అలీ వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. కొద్ది సేపటి తర్వాత బాబర్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. బ్యాట్ తీసుకుని కొట్టేంత గొడవ ఏం జరిగిందా? అని కంగారు పడిపోకండి. బాబర్ అలా ఎందుకు చేశాడంటే..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ టీమ్‌కు మంచి స్టార్ట్ లభించింది. బాబర్ అజమ్‌తో పాటు ఓపెనర్‌గా వచ్చిన మొహమ్మద్ హరీస్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక్కడి నుంచి పెషావర్ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 76 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి పటిష్టస్థితిలో నిలిచిన పెషావర్.. 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ.. బాబర్ ఒక్కడే క్రీజ్‌లో నిలబడి పోరాడుతున్నాడు. ఈ క్రమంలో అద్భుత బౌలింగ్‌తో చెలరేగుతున్న హసన్ అలీ కాన్సట్రేషన్‌ను దెబ్బతీసేందుకు బాబర్ సరదాగా అలీని బ్యాట్‌తో కొట్టబోయినట్లు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. బాబర్ ఎంత ప్రయత్నించిన హసన్ పెషావర్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. 3 వికెట్లతో చెలరేగి పెషావర్‌ను 156 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశాడు. ఈ టార్గెట్‌ను ఇస్లామాబాద్ 14.5 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయం సాధించింది.
ఇక మ్యాచ్ తర్వాత తమ మధ్య జరిగిన సరదా సంఘటన గురించి మాట్లాడిన బాబర్.. ‘నేను అతనితో పెద్దగా మాట్లాడలేదు. కేవలం అతని లయను దెబ్బతీసి, ఒత్తిడిలోకి నెట్టేందుకు అలా చేశాను. కానీ అది పని చేయలేదు.” అని అన్నాడు. హసన్ అలీ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో నా ఓవర్ సరిగా పడలేదు. అయినా కూడా షాదాబ్ నాపై నమ్మకం ఉంచి మళ్లీ బౌలింగ్ ఇచ్చాడు. అందుకు అతనికి థ్యాంక్స్.’ అని అన్నాడు. ఇక బాబర్ అజమ్ ఇన్నింగ్స్ చివరి బంతికి కేవలం సింగిల్ మాత్రమే రావడంతో కోపంగా బ్యాట్‌ను నేలపై పడేశాడు. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఫేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో జట్టులో చోటు కోల్పోయిన హసన్, పీఎస్‌ఎల్‌లో మంచి ప్రదర్శన చేయడం ద్వారా తిరిగి జట్టులోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Some banter between Babar Azam and Hassan Ali#PZvsIUpic.twitter.com/tDsxIhcrCl
— Cricket Pakistan (@cricketpakcompk) February 23, 2023
They say Babar is selfish, Babar is there for personal goals. No man you don’t know a word about Babar. You don’t know how he stands alone for his team, how he saves his team from humiliation. Babar Azam is alone warrior 🙌💥#BabarAzam𓃵
— Nawaz 🇵🇰 (@Rnawaz31888) February 23, 2023