పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను తరచు టీమిండియా మాజీ కెప్టెన్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో పోల్చుతూ ఉంటారు. బాబర్‌ను పాకిస్తాన్ కోహ్లీని అని కూడా పిలుస్తారు. బాబర్ కోహ్లీ కంటే చాలా జూనియర్ అయినా.. కోహ్లీలానే కెరీర్‌లో టాప్‌గేర్‌లో దూసుకుపోతూ మరో కోహ్లీ అనే పేరుతెచ్చుకున్నాడు. తాజాగా టీ20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న బాబర్ అజమ్.. అత్యంత వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ 81 టీ20 మ్యాచ్‌ల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకుంటే.. బాబర్ అజమ్ కూడా శుక్రవారం ఇంగ్లండ్‌తో లాహోర్‌లో గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌తో 3000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఈ మ్యాచ్ బాబర్‌కు టీ20ల్లో 81 మ్యాచ్. 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 87 పరుగులు చేసి బాబర్.. 51 పరుగుల తర్వాత సిక్స్‌తో ఈ ఘనత సాధించాడు.
దీంతో విరాట్ కోహ్లీ మరో రికార్డును బాబర్ సమం చేశాడని.. కోహ్లీ-బాబర్ ఇక్వల్ అంటూ సోషల్ మీడియాలో పాకిస్థాన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. బాబర్ అజమ్ 3000 పరుగులు పూర్తి చేసుకోవడం కంగ్రాట్స్ చెబుతూనే.. కోహ్లీ 3 వేల రికార్డుకు బాబర్ 3 వేల రికార్డుకు ఉన్న తేడాలను ఎత్తి చూపుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. టీ20ల్లో తక్కువ మ్యాచ్‌ల్లో 3 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడు కోహ్లీనే.. కోహ్లీ కేవలం 81 మ్యాచ్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లీ తర్వాత 81 మ్యాచ్‌ల్లోనే బాబర్ కూడా 3 వేల పరుగుల మైలురాయి చేరుకుని సమంగా నిలిచినప్పటికీ.. ఎదుర్కొన్న బంతుల్లో మాత్రం చాలా తేడా ఉంది.
3 వేల పరుగులు బాదేందుకు విరాట్ కోహ్లీ 2,169 బంతులు ఎదుర్కొంటే.. బాబర్ అజమ్ మాత్రం 2,317 బంతులు తీసుకున్నాడు. దీంతో కోహ్లీ రికార్డును బాబర్ మ్యాచ్‌లు పరంగా సమం చేసినా.. బంతుల పరంగా చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ ముందు ఉన్నాడని ఇండియన్ ఫ్యాన్స్ లెక్కల ఆధారంగా నిరూపిస్తున్నారు. కాగా.. విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ 20 బంతులు తక్కువ తీసుకుని 3 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కానీ.. మ్యాచ్ విషయంలో విరాట్ ముందున్నాడు. బంతుల పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ 2149, విరాట్ కోహ్లీ 2169, మార్టిన్ గప్టిల్ 2203, పాల్ స్టిర్లింగ్ 2226, బాబర్ అజమ్ 2317 బంతుల్లో 3 వేల పరుగులు చేశారు.
Virat Kohli 🤝Babar Azam pic.twitter.com/D46K2HYwZe
— CricTracker (@Cricketracker) September 30, 2022
3️⃣0️⃣0️⃣0️⃣ T20I runs for @babarazam258 ✅
He is the joint fastest to the milestone in 81 innings and only the fifth batter to cross the landmark figure 👏#PAKvENG | #UKSePK pic.twitter.com/ZY4TnYKJIp
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022
Balls Taken to reach 3000 T20I runs
2149 – Rohit Sharma
2169 – Virat Kohli
2203 – Martin Guptill
2226 – Paul Stirling
2317 – Babar Azam*#PAKvsENG— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) September 30, 2022
ఇది కూడా చదవండి: పాపం.. పాక్‌ను పిచ్చికొట్టుడు కొట్టిన ఇంగ్లండ్! భారీ టార్గెట్‌ను 15 ఓవర్లలోనే..