స్వదేశంలో తమ అభిమానుల ముందే పరువు పోగొట్టుకుంది పాకిస్థాన్. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారీ టార్గెట్ సెట్ చేసినా.. చిత్తుచిత్తుగా ఓడింది. 170 పరుగుల టార్గెట్‌ను 87 బంతుల్లోనే సమర్పించుకుని పాక్ బౌలర్లు విలన్లుగా మారారు. ఇంగ్లండ్ యువ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ బ్యాటింగ్ సునామీలో పాక్ కొట్టుకుపోయింది. పాక్ బౌలింగ్‌ను తుక్కు తుక్కుగా కొట్టిన సాల్ట్ 170 టార్గెట్ కేవలం 14.3 ఓవర్లలోనే ముగించి పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. మంచి ఇన్నింగ్స్ ఆడి ఖుషీగా ఉన్న బాబర్‌ను పాక్ బౌలర్లు ఏడిపించేశారు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన 6వ టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ దారుణ పరాజయాన్ని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న మొహమ్మద్ రిజ్వాన్‌కు విశ్రాంతి ఇచ్చిన కెప్టెన్ బాబర్ అజమ్ హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సుతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. ఇఫ్తికర్ అహ్మెద్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. దీంతో పాక్ ఒక ఫైటింగ్ టార్గెట్‌ను సెట్ చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ ఒక వికెట్, విల్లే 2, సామ్ కరన్ 2, రిచర్డ్ ఒక వికెట్ తీసుకున్నారు. మంచి బౌలింగ్ ఎటాక్ ఉన్న పాక్ ఈ 170 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగలదని అంతా భావించారు.
గత మ్యాచ్‌లో వచ్చిన థ్రిల్లింగ్ విక్టరీతో పాక్ జట్టులో ఆత్మవిశ్వాసం టన్నుల కొద్ది పెరిగినట్లు కనిపించానా.. ఆ విజయం ఆత్మ విశ్వాసం బదులు అతి విశ్వాసం ఇచ్చినట్లు ఉంది. ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేస్తూ.. కొత్త బౌలర్లతో బరిలోకి దిగి భారీ మూల్యం చెల్లించుకుంది. గత మ్యాచ్‌లో ఉత్కంఠ పోరులో ఓడిన ఇంగ్లండ్ ఈ సారి ఆ తప్పు చేయకుండా పాక్ బౌలర్ల తుప్పు రెగ్గొట్టింది. ముఖ్యంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పాక్ బౌలర్లపై విరుచుపడ్డాడు. అతను సృష్టించిన విధ్వంసానికి పాకిస్థాన్ బౌలర్లు బంతి పట్టుకోవాలంటే భయపడ్డారు. 41 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 88 పరుగులు చేసి సాల్ట్ నాటౌట్‌గా నిలిచి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. అతనికి తోడు అలెక్స్ హెల్స్(12 బంతుల్లో 27), డేవిడ్ మలాన్(18 బంతుల్లో 26), బెన్ డకెట్ ( 16 బంతుల్లో 26 నాటౌట్) బౌండరీల వర్షం కురిపించడంతో 170 పరుగుల టార్గెట్‌ను కేవలం 87 బంతుల్లోనే ఇంగ్లండ్ ఊదేసింది. దీంతో 7 టీ20ల సిరీస్‌ను 3-3తో సమం చేసింది. ఇక 7వ టీ20తో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.
A dominant victory takes it to a decider! 🙌
Scorecard: https://t.co/kKg4B1XiHZ
🇵🇰#PAKvENG 🏴 | @PhilSalt1 pic.twitter.com/7vWKJD1wDJ
— England Cricket (@englandcricket) September 30, 2022
England make it 3️⃣-3️⃣ with a game to go 🏏#PAKvENG | #UKSePK pic.twitter.com/GDwkVbUURk
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022
ఇది కూడా చదవండి: IPL 2023: 20 కోట్లు! IPL చరిత్రలో అత్యధిక ధర పలకనున్న క్రికెటర్!