ఐపీఎల్ 15వ ఎడిషన్ ముగిసి పూర్తిగా ఐదు నెలలు గడిచాయో లేదో.. అప్పుడే ఐపీఎల్ 16వ సీజన్ కోసం వేట మొదలైంది. అందుకోసం ఐపీఎల్ యాజమాన్యాలు.. ఇప్పటినుంచే లెక్కలేసుకుంటున్నట్లు సమాచారం. ఈమధ్యన రాణించిన ఆటగాళ్లు ఎవరెవరు? ఎంత పెట్టొచ్చు? అన్న విషయాలను ఆరా తీస్తున్నాయట. ఈ క్రమంలో అందరి కన్ను ఆస్ట్రేలియా క్రికెటర్ పైనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వేలంలో ప్రాంఛైజీలు అతడి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడవని తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఇండియా- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో అతడాడిన ఇన్నింగ్స్ లే అందుకు కారణం.
వచ్చే ఏడాది మార్చి ఆఖరులో 2023 సీజన్ ప్రారంభం కానుంది. అప్పటి వరకు పటిష్ట జట్టును సిద్ధం చేయాలంటే.. ప్రణాళికలు ఇప్పటినుంచే మొదలుపెట్టాలన్నది.. ఫ్రాంచైజీల అభిప్రాయం. ముఖ్యంగా 2022 సీజన్ లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు ఈ రేసులో ముందన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాంఛైజీలు.. నాణ్యమైన ఆటగాళ్లను ఏరుకునే పనిలో పడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ఇండియాతో ముగిసిన టీ20 సిరీస్ లో దుమ్మురేపిన ఆసీస్ యువ ఓపెనర్ కామెరూన్ గ్రీన్ పై ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. వచ్చే వేలంలో అతని కోసం.. ఈ రెండు ప్రాంఛైజీలు ఎంత పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 15 నుంచి 20 కోట్లు పెట్టడానికైనా వెనుకాడవని విశేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. గ్రీన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది.
Cameron Green departs after a quick-fire fifty 🔥#CameronGreen #INDvAUS #CricketTwitter pic.twitter.com/K9xb8QFmDM
— CricTracker (@Cricketracker) September 25, 2022
డేవిడ్ వార్నర్ కు విశ్రాంతినివ్వడంతో ఇండియా పర్యటనకు వచ్చిన ఈ యువ ఆల్ రౌండర్ సిరీస్ ఆధ్యంతం ఆకట్టుకున్నాడు. మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఫించ్ తో ఓపెనింగ్ కు వచ్చి గ్రీన్ 30 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఆ తరువాత నాగ్‌పూర్ టీ20లో విఫలమైనా.. ఉప్పల్ మ్యాచులో దుమ్ము రేపాడు. 21 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. బంతిని అలవోకగా స్టాండ్స్ లోకి పంపడంలో గ్రీన్ దిట్ట. బ్యాటింగ్ ఒక్కటే గాక అతడు బౌలింగ్ కూడా వేయగలడు. దీంతో ఇతడిని దక్కించుకోవడానికి చెన్నై, ముంబై ప్రాంఛైజీలు ఇప్పటినుంచే వ్యూహాలు పన్నుతున్నాయట. ఈ రెండు ఫ్రాంచైజీలే గాక సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా గ్రీన్ ను దక్కించుకోవాలని చూస్తున్నదని సమాచారం.
If he enters, will Cameron Green be the most sought-after player at the next IPL auction? pic.twitter.com/UtuIVcKL7J
— ESPNcricinfo (@ESPNcricinfo) September 30, 2022
Which IPL Franchise Will Go For Cameron Green In The Auction?#Cricket #Australia #T20WorldCup #CameronGreen #IPL2023 pic.twitter.com/XvBiXMRhHT
— Jega8 (@imBK08) September 30, 2022