SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup 2022 Rahul Dravid Strategies Going Wrong For Team India

Asia Cup 2022: ద్రవిడ్ సర్ అతి ప్రయోగాలే టీమిండియా కొంపముంచాయా?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 7 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: ద్రవిడ్ సర్ అతి ప్రయోగాలే టీమిండియా కొంపముంచాయా?

టైటిల్‌ హాట్‌ఫేవరేట్‌గా ఆసియా కప్‌ బరిలోకి దిగిన టీమిండియా సూపర్‌ ఫోర్‌తోనే సరిపెట్టుకునేలా ఉంది. గ్రూప్‌స్టేజ్‌లో పాకిస్థాన్‌, హాంకాంగ్‌ను ఓడించిన భారత్‌.. సూపర్‌ ఫోర్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్‌.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఆసియా కప్‌ 2022లో టీమిండియా ప్రస్థానం దాదాపు ముగిసినట్టే. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. ఫైనల్‌కు చేరే అవకాశం లేదు. ఆసియా కప్‌లో టీమిండియా ఓటములతో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తుది జట్టు ఎంపికలో ద్రవిడ్‌ అనుసరిస్తున్న విధానాలే టీమిండియా పరాజయాలకు కారణాలు అవుతున్నాయని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. పరిస్థితులకు తగ్గట్లు జట్టులో మార్పులు, చేర్పులు చేయడంలో తప్పులేదు. కానీ.. అసలు ఏ లక్ష్యంతో అయితే జట్టు కూర్పు జరుగుతుందో.. దాన్ని మైదానంలో అమలు చేయకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

జట్టులోకి దీపక్‌ హుడాను ఎందుకు తీసుకున్నారంటే.. మినిమమ్‌ క్రికెట్‌ నాలెడ్జ్‌ ఉన్నవారు ఎవరైనా సరే.. ఆల్‌రౌండర్‌ కాబట్టి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడతాడని తీసుకున్నారని చెబుతారు. పైగా దినేష్‌ కార్తీక్‌ లాంటి స్టార్‌ ఫినిషర్‌ను పక్కనపెట్టి మరీ హుడాను తీసుకుని అతనితో బౌలింగ్‌ మాత్రం చేయించలేదు. ప్రధాన బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నా.. ఒకటి, రెండు ఓవర్లు హుడా చేత పూర్తి చేయించకుండానే మ్యాచ్‌ను ముగిస్తున్నారు. పైగా టాపార్డర్‌ బ్యాటర్‌ అయిన హుడాను లోయరార్డర్‌లో దింపుతున్నారు. బౌలింగ్‌ ఇవ్వకుండా ఒక ఫినిషర్‌ రోల్‌లో అతన్ని ఆడించాల్సిన అవసరం ఏముంది? ఫినిషర్‌ రోల్‌ కోసమే.. కదా దినేష్‌ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంది. మరి అతన్ని పక్కన పెట్టి హుడా ఎందుకు ఆడిస్తున్నారో అర్థం కావడం లేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే డీకే లేని లోటు స్పష్టంగా కనిపించినా శ్రీలంకతో అతన్ని పక్కనపెట్టారు. మరోసారి చివరి ఓవర్లలో కావాల్సినన్ని పరుగులు రాలేదు. ఇది కూడా టీమిండియా ఓటమిపై ప్రభావం చూపించింది.

rahul david

ఇక బౌలర్ల ఎంపిక అయితే ఎవరీకి అర్థం కాని ఒక ఫెల్యూర్‌ స్ట్రాటజీ.. పాకిస్థాన్‌తో మిగతా బౌలర్లంతా విఫలం అవుతున్నా.. రవి బిష్ణోయ్‌ ఒక్కడే అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన అతను 26 పరుగులు మాత్రమే ఇచ్చి పవర్‌ప్లేలో ఒక వికెట్‌ పడగొట్టాడు. అలాంటి మంచి రిథమ్‌లో ఉన్న బౌలర్‌ను శ్రీలంకతో మ్యాచ్‌లో పక్కన పెట్టి.. అశ్విన్‌ను జట్టులోకి తీసుకుని చాహల్‌ను కొనసాగించారు. నిజానికి శ్రీలంకతో మ్యాచ్‌లో చాహల్‌ను పక్కన పెట్టాలి. శ్రీలంకతో మ్యాచ్‌లో చాహల్‌ మూడు వికెట్లతో రాణించినా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మొహమ్మద్‌ షమీని ఆసియా కప్‌ కోసం ఎంపిక చేయలేదు. అప్పటికే బుమ్రా లాంటి స్టార్‌ బౌలర్‌ గాయంతో అందుబాటులో లేకున్నా.. టీ20 వరల్డ్‌ కప్‌ ప్రణాళికల్లో లేడనే ఒక చెత్త కారణంతో ఫామ్‌లో ఉన్న షమీని ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు. భువనేశ్వర్‌, అర్షదీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌ను తీసుకున్నారు. వీరిలో ఆవేశ్‌ ఖాన్‌ ఎంపిక అత్యంత దారుణమైన ఎంపిక. వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటనల్లో ఆవేశ్‌ విఫలం అయినా.. అతన్ని ఆసియా కప్‌కు ఎంపిక చేశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలం అయిన ఆవేశ్‌.. సూపర్‌ ఫోర్‌లో జ్వరంతో మ్యాచ్‌లు ఆడటం లేదు. ఆశేష్‌ లేకపోవడంతో టీమిండియా ఆశ్చర్యకరంగా కేవలం నలుగురు స్పెషలిస్ట్‌ బౌలర్‌తోనే బరిలోకి దిగింది. హార్దిక్‌ పాండ్యాపై అతి నమ్మకంతో వెళ్లిగా.. పాక్‌, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో పాండ్యా దారుణంగా విఫలం అయిన విషయం తెలిసిందే.

rahul david

 

అలాగే బ్యాటింగ్‌లో ఫామ్‌లో లేకపోయినా.. లెఫ్ట్‌ హ్యాండర్‌ కావాలనే ఉద్దేశంతో రిషభ్‌ పంత్‌ను ఆడిస్తున్న ద్రవిడ్‌. శ్రీలంకతో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోతే పంత్‌ బదులు పాండ్యాను పంపించి ఆశ్యర్యపరిచాడు. ఇనిషియల్‌గా కొంత టైమ్‌ తీసుకునే పంత్‌ను కాస్త ముందు పంపితే జట్టుకు మేలు జరిగేది. దాంతో పాటు లెఫ్ట్‌రైట్‌ కాంబినేషన్‌ కూడా టీమిండియాకు అడ్వాంటేజ్‌గా మారేంది. కానీ.. ద్రవిడ్‌ వేరేలా ఆలోచించాడు. దీంతో పాండ్యా, పంత్‌ ఇద్దరూ విఫలం అయ్యారు. ఇక కేఎల్‌ రాహుల్‌ ఎంపిక గురించి చెప్పుకుంటే.. గాయాలు, సర్జరీ తర్వాత వచ్చిన రాహుల్‌ కంటే శిఖర్‌ ధావన్‌ ఆసియా కప్‌ జట్టులో బెస్ట్‌ పిక్‌గా ఉండేవాడు. నిజానికి రోహిత్‌-ధావన్‌ ఓపెనింగ్‌ జోడికి మంచి రికార్డ్స్‌ ఉన్నాయి. కానీ.. టీ20 వరల్డ్‌ కప్‌ ప్రణాళికల్లో లేడనే ఒక​ పనికి రాని స్ట్రాటజీతో ధావన్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు. ఇలా రాహుల్‌ ద్రవిడ్‌ తన స్ట్రాటజీలతో టీమిండియాలో ఊహించని మార్పులు చేస్తూ.. మొదటికే ముప్పు తెస్తున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పాపం అర్షదీప్‌.. కెప్టెన్‌ ప్రవర్తనతో బిత్తరపోయాడు! రోహిత్‌ శర్మపై నెటిజన్లు ఫైర్‌

In the post match press conference you said you will play six bowlers in the World Cup. So why not in Asia cup? Was this tournament not important? What was coach Rahul Dravid’s suggestion? How could you drop Ravi Bishnoi? Poor leadership. @ImRo45 #RohitSharma

— Sushant Mehta (@SushantNMehta) September 6, 2022

Rahul Dravid on comparing India’s bowling attack to Pakistan’s “Our bowling attack might not be as……..I want to use a word but I can’t use that word. It’s a 4 letter word that begins with S” #Cricket #AsiaCup #INDvPAKpic.twitter.com/JD6qSvjq93

— Saj Sadiq (@SajSadiqCricket) September 4, 2022

Tags :

  • Arshdeep Singh. Cricket News
  • Asia Cup 2022
  • India vs Sri Lanka
  • Rahul Dravid
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు! మండిపడుతున్న కింగ్ ఫ్యాన్స్!

    కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు! మండిపడుతున్న కింగ్ ఫ్యాన్స్!

  • Rahul Dravid: మూడో వన్డేలోనూ ఇదే జట్టుతో ఆడతాం.. మా తీరు మారదు: కోచ్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

    Rahul Dravid: మూడో వన్డేలోనూ ఇదే జట్టుతో ఆడతాం.. మా తీరు మారదు: కోచ్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

  • Rahul Dravid: టీమిండియాని నాశనం చేస్తున్న ద్రవిడ్! వరల్డ్ కప్ కాదు, చేతికి చిప్పే!

    Rahul Dravid: టీమిండియాని నాశనం చేస్తున్న ద్రవిడ్! వరల్డ్ కప్ కాదు, చేతికి చిప్పే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam