గురువారం వైఎస్ విజయమ్మ ఖమ్మం జిల్లాలోని పాలేరు లో పర్యటించారు. అక్కడ వైఎస్సార్ టీపీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మ జిల్లాలో దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పర్యటించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరులో వైఎస్సార్ టీపీ ప్రజా భవనాన్ని ఆమె ప్రారంభించారు. వైఎస్సార్ టీపీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇప్పుడు షర్మిల అడ్రెస్ ఎక్కడా అని అంటే పాలేరు అవుతుందని విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ ప్రారంభిచిన పథకాలను పూర్తి చేసేందుకు షర్మిల మీ ముందుకు వచ్చిందని ఆమె తెలిపారు. పాలేరును షర్మిలకు గిప్ట్ గా ఇవ్వాలని ఆమె కోరారు. వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రస్తుతం ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాదయాత్ర ప్రస్తుతం జనగాం జిల్లాలో కొనసాగుతుంది.
గురువారం ఖమ్మ జిల్లా పాలేరులో వైఎస్ విజయమ్మ పర్యటించారు. అక్కడ వెఎస్సార్ టీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..”వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఈ ఖమ్మం జిల్లా ఎంతగానో ఆదరించింది. అలానే జగన్ మోహన్ రెడ్డిని కూడా ఈ జిల్లా ప్రజలు ఆదరించారు. అలానే ఈ రాష్ట్రంలో షర్మిల రెండు సార్లు పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. అలా వైఎస్ కుటుంబానికి ఈ ఖమ్మ జిల్లాతో ఏదో రుణాను బంధం ఉంది.
ఏం కార్యక్రమాలు జరిగిన ఇక్కడి నుంచే జరిగేవి. షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఖమ్మం జిల్లాలో నుంచి ప్రకటించింది. అలానే ఇక్కడి నుంచి తాను ఎన్నికల బరిలో నిలబడాలని షర్మిల భావిస్తుంది. ఇలా ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలని షర్మిల భావించడం వెనుకా ఆ దేవుడి సంకల్పం ఉంది. రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్ట్ లు నేటికి పూర్తి కానీ పరిస్థితి. మరి.. షర్మిలమ్మ అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని దేవుడు సంకల్పించాడేమో నాకు తెలిదు. మిమ్మల్ని నేను ఒక్కటే కోరుతున్నాను. షర్మిలమ్మకు గట్టి పునాది మీరు ఇవ్వాలి.
ఆమె కూడా మీకు గొప్ప బలం అవుతుందని నేను గట్టిగా చెప్తున్నాను. అంతేకాక పాలేరును షర్మిలమ్మకు బహుమతిగా ఇవ్వాలని ఇక్కడి ప్రజలను కోరుతున్నాను. వైఎస్ కుటుంబానికి పులివెందుల ఎలాగునో.. షర్మిలమ్మకు పాలేరు అలానే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరికి రాని మోజార్టీని షర్మిలకు ఇచ్చి ఘన విజయం అందించాలని కోరుకుంటున్నాను. అలానే మీకు ఏ సమస్య వచ్చిన తీర్చేందుకు అడ్డగా షర్మిల ఉంటుంది” అని వైఎస్ విజయమ్మ అన్నారు.
ఇక వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం 238వ రోజుకు జనగాంలో కొనసాగుతుంది. గురువారం జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల నిప్పులు చెరుగుతున్నారు. మరి.. వైఎస్ కుటుంబానికి పులివెందులలా.. షర్మిలకు పాలేరు కావాలని వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.