ఈ మధ్యకాలంలో అక్రమ సంపాదన కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. అడవుల మీద పడి అక్కడి సంపదను దొంగచాటుగా కాజేస్తున్నారు. అడవిలో దొరికే చిన్న గడ్డి పూచ నుంచి అన్ని రకాల జీవాలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి.. పెద్ద మొత్తంలో ధనం అర్జీస్తున్నారు. అయితే కొన్ని సందర్బాల్లో పోలీసులు పసిగట్టి.. ఈ స్మగ్లర్ల నుంచి అటవీ జీవాలను రక్షిస్తున్నారు. తాజాగా రూ.25 కోట్ల విలువ చేసే పామును కొందరి వ్యక్తుల నుంచి కోర్టు కాపాడింది. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని బెగసరాయ్ జిల్లాలోని ఓ గ్రామంలోని కొందరికి రెండు తలలున్న పాము దొరికింది. అయితే ఆ పాము చూడటానికి కొత్తగా ఉండటంతో స్థానిక వ్యాపారులకు చూపించారు. దీంతో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. మార్కెట్లో దాని విలువ రూ.25 కోట్లు ఉంటుందని టాక్ వచ్చింది. దీంతో అతి తక్కువ ధరకు ఆ పామును కొన్నాలని కొందరు భావించారు. ఈ క్రమంలో పామును కొనేందుకు గ్రామస్థులతో బేరాలు కూడా చేశారు. ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. అలానే ముకేష్ పాశ్వాన్ అనే జంతు ప్రేమికుడికి కూడా ఆ పాము విషయం తెలిసింది. ఎలాగైనా ఆ పామును రక్షించాలను ముకేష్ అనుకున్నాడు. వెంటనే ఈ పాము సమాచారాన్ని స్థానిక కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఇది అత్యంత అరుదైన అంతరించి పోతున్న సర్పమని, కాపాడాలని ముకేష్ కోర్టులో పిటిషన్ వేశాడు.
దీంతో అతడి అభ్యర్ధనను స్వీకరించిన కోర్టు.. పామును వెంటనే కోర్టుకు తీసుకురావాలని స్థానిక అటవీ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు గ్రామస్థుల నుంచి పామును స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అందరు అనుకున్నట్లు అది రెండు తలల పాము కాదని, ఓ వైపు తల ఉండి మరో వైపు తలను పోలిన భాగమేనని, ఈ పాము జంతువుల సంరక్షణ కేంద్రానికి తరలించాలని అధికారులను న్యాయమూర్తి సతీష కుమార్ ఆదేశించారు. పామును కంటైనర్ లో కోర్టుకు తీసుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాము గురించి అటవీ అధికారులు ఆసక్తికర విషయాలు తెలిపారు.
ముఖ్యంగా చైనాలో ఈ పాము మాంసం తింటారని అధికారులు అన్నారు. లైంగిక శక్తిని విపరీతంగా పెంచుతుందని అక్కడి వారు నమ్ముతారని అధికారులు తెలిపారు. ఈ పాము చాలా ప్రశాంతమైనదని, మనుషులకు ఎటువంటి హాని కలిగించనదని అన్నారు. విషపూరితం కానీ ఈ పాము కీటకాలను, ఎలుకను ఆహారంగా తీసుకుంటుంది. ఇలా పొల్లాలో ఎలుకలను ఇతర కీటకాలను తిని రైతుల పంటలను కాపాడుతుంది. ఏదైన ప్రమాదం జరినప్పుడు తన తోకనే నోరులా పైకి తెరుస్తుందని, దీంతో స్థానికులు రెండు తల పాము అని పిలుస్తారని అధికారులు తెలిపారు.
Snake : 2 मुँह वाले इस दुर्लभ सांप को देख लीजिए, 25 Crore है इसकी क़ीमत#begusaraisnake #snakevideo #begusarai pic.twitter.com/fHsWF1Fkze
— Bihar Tak (@BiharTakChannel) October 13, 2022