ఇటీవల దేశంలో ఎక్కడ చూసినా వర్షాలే.. వర్షాలు. ఈ వర్షాల ధాటికి చెరువులు నిండిపోతున్నాయి.. వాగులు వంకలు, పిల్ల కాలువలు, పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొన్నిచొట్ల భారీ వరదలకు చిన్న చిన్న బ్రిడ్జీలు కొట్టుకొని పోయాయి.. ఇక రోడ్ల పరిస్థితి పత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశంలో ఎంతో గొప్ప పర్యాటక ప్రదేశంగా ఉన్న గోవాలో వర్షాల కారణంగా ప్రమాదం జరిగింది. ఇక్కడ పర్యాటక ప్రాంతమైన దుద్ సాగర్ జలపాతం వద్ద కేబుల్ బ్రిడ్జి కూలడంతో ప్రమాదం జరిగింది.
గోవా- కర్ణాటక సరిహద్దులో ప్రజలు ఎక్కువగా సందర్శించే అద్భుతమైన జలపాతం దుద్ సాగర్. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఈ జలపాతం కేబుల్ బ్రిడ్జీ కూలిపోయింది. ఇక్కడ సందర్శనానికి వచ్చిన నలభై మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. భయంతో ఆర్తనాదాలు పెట్టుకున్నారు. వెంటనే దృష్టి లైఫ్ సేవర్స్ బృందం రంగంలోకి దిగి పర్యాటకులను ఒక్కొక్కరినీ బ్రిడ్జి దాటించి కాపాడారు. భారీ వర్షాల కారణంగా దుద్ సాగర్ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది.
జలపాతం ఉధృతికి మండోవి నదిపై ఉన్న చిన్న కేబుల్ బ్రిడ్జి కొంత భాగం కొట్టుకుపోవడంతో పర్యాటకులు దాన్ని దాటలేక చిక్కుల్లో పడ్డారు. ఓ వైపు నీటి ఉధృతి.. మరోవైపు కేబుల్ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో 40 మంది పర్యాటకులు భయంతో వణికిపోయారు. తామను రక్షించేందుకు ఎదురు చూస్తున్న సమయంలో దృష్టి లైఫ్ సేవర్స్ రెస్క్యూ టీమ్ వారిని కాపాడారు. సాధారణంగా భారీ వర్షాల సమయంలో ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు ఎవరికీ పరిమిషన్ ఇవ్వరు.
ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల అనుమతి ఇచ్చారు. అనుకోకుండా భారీ వర్షాలు పడటం కాలువలో నీరు ఉధృతిగా ప్రవహించి కేబుల్ బ్రిడ్జి కూలడం జరిగింది. మొత్తానికి 40 మంది పర్యటకులు ప్రాణాపాయం నుంచి బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక నలభై మంది పర్యాటకులను రక్షించిన దృష్టి లైఫ్ సేవర్స్ రెస్క్యూ టీమ్ ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అభినందించారు.
The River Lifesaver rescued around 40 guests stuck at Dudhsagar Waterfall due to turning of crossing bridge where water level increased due heavy rainfall.
I thank and congratulate the River Lifesavers for rescuing the tourists. pic.twitter.com/prw6yK69qi
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) October 14, 2022