Viral Video: పొద్దున్నే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయి.. మంచి రుచికరమైన టిఫిన్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. పెళ్లైన వాళ్లయితే ఇంట్లోనే వండుకుని రుచిగా, శుచిగా తింటారు. అది పెళ్లికాని బ్యాచిలర్స్ విషయంలో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. పొద్దున్నే లేవటం కుదరదు. ఒకవేళ లేచినా టిఫిన్ చేసుకోవాలంటే బద్ధకం. కొంత మంది బ్యాచిలర్స్ ఈ టిఫిన్ గోల ఏంటని ఏ పదకొండుకో.. పన్నెండుకో లేచి ఏకంగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. మరికొంతమంది టిఫిన్ సమయానికి టిఫిన్ సెంటర్ల ముందు వాలిపోతారు. టిఫిన్ సెంటర్ బిజీగా ఉంటే ఓపిగ్గా వేచి ఉండి మరీ టిఫిన్ చేసేస్తుంటారు.
ప్లేట్లు సరిగా కడకపోయినా, ఇడ్లీలో చట్నీ బాగాలేకపోయినా.. ఎంత ఇబ్బంది వచ్చినా టిఫిన్ చేయాలి కదా అన్నట్లు చేస్తుంటారు. ఇక, ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు టిఫిన్ ఏటీఎమ్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. మనకు ఇష్టమైన టిఫిన్‌ను ఏటీఎమ్‌లలో డబ్బులు డ్రా చేసినట్లు వేడివేడిగా డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం బెంగళూరు నగరంలో టిఫిన్ ఏటీఎమ్ మిషిన్లు అందుబాటులోకి వచ్చాయి. రోజులో 24 గంటలూ ఆ సెంటర్లు సేవలను అందిస్తున్నాయి. కస్టమర్లు తమకిష్టమైన టిఫిన్‌ను అప్పటికప్పుడు వేడివేడిగా డ్రా చేసుకుని తినొచ్చు.
ఇందుకోసం మనం చేయాల్సిందేంటంటే.. టిఫిన్ ఏటీఎమ్‌ల దగ్గరకు వెళ్లి మనకు ఏం కావాలో స్కాన్ చేసుకోవచ్చు. ఇడ్లీ, వడ, ఉప్మా ఇలా కొన్ని రకాల ఐటమ్స్ అందులో ఉంటాయి. వాటిలోంచి మనకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలి. అప్పుడు ఓ క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని మిషిన్ మీద పెట్టి స్కాన్ చెయ్యాలి. అంతే ఇడ్లీ అప్పటికప్పుడు తయారవటం మొదలవుతుంది. కేవలం 1 నిమిషంలోపే వేడివేడి ఇడ్లీ మనకు అందుతుంది. ప్రస్తుతం టిఫిన్ ఏటీఎమ్ మిషిన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IDLI ATM in BANGALORE….
😋😋😋😋😋😋😋#Bangalore pic.twitter.com/l8D4ayf5je
— Subba Rao🇮🇳🇮🇳🚩🕉️ (@SubbaRaoTN) October 13, 2022
ఇవి కూడా చదవండి: వీడియో: రీల్ చేసి సెలబ్రిటీ అవుదాం అనుకున్నాడు.. కానీ చివరికి..!