సోషల్ మీడియా.. ఇది పాపులర్ అయ్యాక అంతా సెలబ్రిటీలు అయిపోవాలని వెయ్యని వేషం లేదు, చేయని సాహసం లేదు. అయితే దానిని నమ్ముకుని ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. కానీ, చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. సెలబ్రిటీ అవ్వాలి, మన గురించి నలుగురు మాట్లాడుకోవాలంటూ నానా తిప్పలు పడుతున్నారు. కొందరైతే సాహసాలు, స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ రీల్స్ మాయలో మరోప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ కుటుంబం రోడ్డున పడింది.
పంజాబ్‌లోని లూథియానాలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ లో ఒక స్టంట్ చేశాడు. బోగీ హ్యాండిల్స్ పట్టుకుని వేగంగా వెళ్తున్న ట్రైన్‌లో బయటకు నిల్చున్నాడు. ఇంకో యువకుడు అదే బోగీ మరో ద్వారంలో నిల్చొని అతని సాహసాన్ని వీడియో తీస్తూ ఉన్నాడు. మొదట ఆ యువకుడు చాకచక్యంగా చాలా కరెంట్ స్తంభాలను తప్పించుకున్నాడు. అప్పటివరకు ఆ వీడియో అంతా బాగానే సాగింది. కానీ, చివర్లో ఓ స్తంబ్ నిచ్చెన అతని చేతికి తగిలి ఒక్కసారిగా రన్నింగ్ ట్రైన్ నుంచి నేల మీద పడ్డాడు. విసిరికొట్టిన బంతిలా నేలకు తాకి పైకిలేచి కింద పడ్డాడు. అతని తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మాల్వా ఎక్స్ ప్రెస్‌లో ఈ ఘటన సంభవించింది. అతని వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీలులు భావిస్తున్నారు.
అతను ఎవరు ఏంటనే వివరాలు పోలీసులకు దొరకలేదు. అతని వద్ద సెల్‌ఫోన్, ఐడీకార్డులు, ఎలాంటి సమాచారం లేదు. డెడ్‌బాడీని ఖన్నా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని వివరాలు ఏమీ తెలియకపోవడంతో మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీలోనే పెట్టారు. అతని వివరాలు తెలియాలి అంటే ఆ వీడియో చిత్రీకరించిన వ్యక్తి చెప్తె తప్ప తెలిసే పరిస్థితి లేదంటున్నారు పోలీసులు. కానీ, అతనిపై కేసు అవుతుందని ఆ వీడియో తీసిన వ్యక్తి ముందుకు రావడం లేదని పోలీసులు భావిస్తున్నారు. కానీ, సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఎంత మంది ఎన్నిసార్లు ఇలా చేయకండని నెత్తీ నోరు కొట్టుకుంటూ మొత్తుకుంటున్నా.. కొందరికి లెక్కలేకుండా పోయింది. ఏవో స్టంట్స్, వీడియోలు తీసి హీరోలు అవుదాం, సెలబ్రిటీలు అవుదామని ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్లని నమ్ముకున్న కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.
Playing with life and death. A youth is performing stunt in a fast moving train. He paid with his life for this stunt. 😱🔞🤯#India #CrazyHorror pic.twitter.com/SOecJU8nXG
— Dr.GHAZAL 🦌 (@ghazal67) October 12, 2022