Contact Lense: ఈ మధ్య కాలంలో కంటి సమస్యలు ఉన్న వారు కాంటాక్ట్ లెన్స్‌లు వాడటం విపరీతంగా పెరిగిపోయింది. కంటి అద్దాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు.. కంటి అద్దాలతో తమ అందం పాడవుతుందని బాధపడుతున్నవారు కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం అంత సులభం కాదు. వాటికోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి తప్పు చేసినా తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రిళ్లు కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుని నిద్రపోకూడదు. ఎందుకంటే అవి పొరపాటున కంట్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.
మరి, ఈ విషయం తెలుసో లేదో తెలీదు కానీ, ఓ మహిళ కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుని నిద్రపోయింది. అలా దాదాపు వరుసగా 23 రోజులు చేసింది. 23 రోజులు ఆ కాంటాక్ట్ లెన్స్‌లు కనిపించకుండా పోయాయి. అవి ఏమవుతున్నాయో ఆమెకు అర్థం కాలేదు. ఓ నెల రోజుల తర్వాతినుంచి ఆమె కుడి కంట్లో నొప్పి తీయటం మొదలైంది. నొప్పి భరించలేక ఆమె అస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆమె కంట్లో ఏదో ఉన్నట్లు గుర్తించాడు. ఓ మంచి సర్జికల్ వస్తువుతో కంట్లో ఉన్న వాటిని తియ్యటం మొదలుపెట్టాడు. అలా ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్‌లను ఆమె కుడి కంటిలోంచి తీశాడు.
అన్ని కాంటాక్ట్ లెన్స్‌లు ఆమె కంటిలోంచి రావటం చూసి ఆయనే ఆశ్చర్యపోయాడు. ఇక, ఈ ఘటనపై సదరు వైద్యుడు మాట్లాడుతూ.. ‘‘ నేను ఎంతో జాగ్రత్తగా ఆ కాంటాక్ట్ లెన్స్‌లను బయటకు తీశాను. అవి మొత్తం 23 ఉన్నాయి. వాటిని కంటి నుంచి బయటకు తీయటానికి మంచి సర్జికల్ వస్తువును వాడాల్సి వచ్చింది. అవి నెల రోజులు కంటిలోపలి నల్ల గుడ్డు దగ్గర ఉండటంతో ఒకదానికి ఒకటి అతుక్కుని ఉన్నాయి’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఇప్పటికే ఒక మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
View this post on Instagram