ప్రపంచంలో త్వరగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లాలంటే విమానయానం ఒక్కటే మార్గం. అలా ప్రయాణం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగుతూ ఉంటాయి. మరి కొన్ని సమయాల్లో రక్షణ శాఖకు సంబంధించిన యుద్ధ విమానాలు సైతం కుప్పకూలుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా ప్రాణనష్టం కూడా జరుగుతుంది. తాజాగా అలాంటి సంఘటనే గ్రీస్ లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందా పదండి.
ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్ కు చెందిన ఓ కార్గో విమానం గ్రీస్ లో కుప్పకూలింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. గ్రీస్ లో కవాలా నగరానికి సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన భారీ కార్గో విమానం కుప్పకూలిందని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
#BREAKING: A Ukrainian cargo plane has reportedly crashed in Kavala, Greece.
Developing…
pic.twitter.com/zIKKbH22pV— Moshe Schwartz (@YWNReporter) July 16, 2022
ప్రమాదానికి గురైన విమానాన్ని ఆంటోనోవ్-ఏఎన్ 12-బీకేగా గ్రీస్ అధికారులు గుర్తించారు. దీనిని ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కంపెనీ నిర్వహిస్తుంది. ఈ కార్గో సెర్బియా నుంచి జోర్డాన్ కు వెళ్తుండగా పెద్ద పెద్ద శబ్దాలతో ఆకాశంలోనే పేలిపోయింది. దీనిలో పెద్ద మెుత్తంలో పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 12 టన్నుల బాంబులు, ఇతర ఆయుధ సామాగ్రి ఉన్నట్లు సమాచారం.
ఆంటోనోవ్-12 యుద్ధ విమానంలో మెుత్తం 8 మంది సిబ్బంది ఉన్నారని.. అందులో కొన్ని పేలుడు పదార్థాలు ఉన్నట్లు స్టేట్ బ్రాబ్ కాస్టర్ ERTతెలిపింది. ఇదిలా ఉండగా.. దీని ఇంజన్ ఫెయిల్ అయింది. వెంటనే పైలట్లు ఏవియేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విమానాన్ని థెస్స, లేదా కవాల విమానాశ్రయంలో ల్యాండ్ చెయ్యాలని.. దానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే కవాలా విమానాశ్రయానికి పశ్చిమాన 40 కి.మీ దూరంలో విమానం కూలింది. ”జనావాసాలకు 2 కి.మీ దూరంలోనే ఇది కూలింది. దాంతో భారీ ప్రాణనష్టం తప్పిందని” పాజియో మేయర్ ఫిలిప్పోస్ అనస్టాస్పియాడిస్ తెలిపాడు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ మారిన ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ukrainian cargo plane traveling from Serbia to Jordan crashes in Kavala, Greece. Aircraft was transporting 12 tons of war equipment and ammo. pic.twitter.com/Mto321vNU0
— VRosen 📿 (@vrosen11) July 16, 2022