స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటే స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి ఉంటుంది. అదుంటే దిగడానికి అనుమతి ఉంటుంది. అయితే ఒక నగరంలో మాత్రం స్విమ్మింగ్ పూల్ లో మొత్తం దుస్తులు విప్పేసి దిగుతారు. మగవారు మాత్రమే దిగేవారు. ఇప్పుడు ఆడవారు కూడా హక్కులో సమాన వాటా కావాలని కోరడంతో అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మగ వెధవలతో పాటు ఆడవారు కూడా టాప్ లెస్ గా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి చావచ్చు అంటూ అనుమతి ఇచ్చి పడేసింది.
మగాళ్ల మాదిరిగానే మమ్మల్ని కూడా స్విమ్మింగ్ పూల్స్ లోకి అనుమతించాలని ఒక మహిళ చేసిన డిమాండ్ కు అధికారులు దిగి వచ్చారు. మగాళ్ళకొక న్యాయం, మహిళలకొక న్యాయమా అని ఆమె ప్రశ్నించడంతో స్నానం టాప్ లెస్ గా చేసుకుంటే చేసుకోండి అని అనుమతి ఇచ్చారు. జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని ఒక పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అందులో ఇప్పటి వరకూ మగవారు మాత్రమే సన్ బాత్ పేరుతో టాప్ లెస్ గా దిగేవారు. టాప్ లెస్ గా దిగితే సూర్యకిరణాలు ఒంటికి తగిలి ఆరోగ్యం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఒక మహిళ కూడా టాప్ లెస్ గా సన్ బాత్ చేసింది. ఆమెను అధికారులు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు గెంటేశారు.
దీంతో ఆమె అంబుడ్స్ పర్సన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. మగవారిని టాప్ లెస్ గా అనుమతించినప్పుడు మహిళలను కూడా టాప్ లెస్ గా సన్ బాత్ చేసేందుకు అనుమతించాలని.. అనుమతించకపోవడం లింగ వివక్ష అవుతుందని ఆమె పేర్కొంది. దీంతో అధికారులు మహిళలను కూడా టాప్ లెస్ గా స్విమింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు, సన్ బాత్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. పురుషులతో పాటు తమను కూడా సమానంగా చూడాలని ఆమె డిమాండ్ చేసింది. దీనిపై విచారణ జరిపిన నగర అధికారులు మహిళలు కూడా టాప్ లెస్ గా సన్ బాత్ చేసేందుకు అనుమతిచ్చారు. బెర్లిన్ లో స్విమ్మింగ్ పూల్స్ ను సందర్శించే వారంతా టాప్ లెస్ గా వెళ్ళడానికి అర్హులని అధికారులు వెల్లడించారు.
బేడర్ బెట్రీబ్ నిర్ణయాన్ని అంబుడ్స్ పర్సన్ కార్యాలయం స్వాగతిస్తుంది. బెర్లిన్ వాసులందరికీ పురుషులైనా, మహిళలైనా, ట్రాన్స్ జెండర్లయినా అందరికీ సమాన హక్కులను కల్పిస్తుందని తెలిపింది. ఇది బేడర్ బెట్రీబ్ లో సిబ్బందికి చట్టపరమైన ఖచ్చితత్వాన్ని కూడా సృష్టిస్తుందని అంబుడ్స్ పర్సన్ కార్యాలయం చీఫ్ డోరిస్ లైబ్షెర్ అన్నారు. ఇకపై బహిష్కరణలు లేదా గృహ నిషేధాలు జారీ చేయబోమని అన్నారు. గత ఏడాది నార్త్ రైన్ వెస్ట్ ఫాలియాలోని సీజెన్, లోవర్ సాక్సోనీలోని గాట్టింగెన్ తో సహా అనేక నగరాలు పబ్లిక్ పూల్స్ లో టాప్ లెస్ గా స్విమ్మింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు నివేదికలు వచ్చాయి. కానీ లోవర్ సాక్సోనీ రాష్ట్ర రాజధాని హనోవర్ స్విమ్మింగ్ పూల్ లో దిగేటప్పుడు ప్రాథమిక లైంగిక అవయవాలను కప్పుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతానికైతే బెర్లిన్ నగరంలో పబ్లిక్ పూల్స్ లో టాప్ లెస్ గా ఈత కొట్టేందుకు మహిళలకు అనుమతి ఇచ్చింది ఆ నగరం. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.