బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అన్ని సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం ఆదరణం కోసం ఆరటపడుతున్నట్లు బాగా తెలుస్తోంది. ఈ హౌస్‌లో బాగా వినిపించే పేర్లు ఏమైనా ఉన్నాయి అంటే అవి గీతూ రాయల్, రేవంత్ మాత్రమే. వాళ్లలో కూడా గీతూ రాయల్ పేరే బాగా వినిపిస్తుంది. హౌస్‌లో ఆమెతో ఢీకొట్టే వాళ్లే లేరని చెప్పాలి. నిజానికి నాగార్జున కూడా ఆమెకు నమస్కారం పెట్టి చాలా సందర్భాల్లో నీతో నాకెందుకు గీతూ అంటూ నవ్వుతూ తప్పుకున్నాడు. టాస్క్ ఏదైనా, సందర్భం ఏదైనా తనకు నచ్చిన రీతిలో గేమ్ ఆడుతుంది. ఏదైనా అంటే నా ఇష్టం నీకెందుకు బిగ్ బాస్ చూసుకుంటాడులే అంటూ కౌంటర్లు వేస్తుంది. హౌస్‌లో ఎవరినైనా తనకు నచ్చకపోతే ఏమైనా అనేస్తుంది. మిమ్మల్ని టార్గెట్ మీలోని అసలు వ్యక్తిని బయటకు తీయడమే నా గేమ్ అంటూ తెలివిగా సమాధానం చెబుతుంది.
కొన్నిసార్లు అయితే అసలు బిగ్ బాస్ గీతూని దత్తత తీసుకున్నాడేమో అనే అనుమానం కూడా రాకమానదు. ఎందుకంటే ఆమె ఏ టాస్కులో ఎన్ని తప్పులు చేసినా కూడా ఆమెను కనీసం మాట కూడా అనరు. నాగార్జున కూడా ఎంతో మెల్లగా సున్నితంగా మాట్లాడతాడు. ఇవతల వారిని ఏం పీకావు? అని ప్రశ్నించే నాగార్జున.. రూల్స్ పాటించకపోయినా కూడా చప్పట్లు కొట్టి శభాష్ అనేస్తారు. ఇదే అశంపై హౌస్‌మేట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఇంట్లోని సభ్యులు కూడా అన్నీ చెప్పినట్లు చేస్తే చప్పట్లు రావని గ్రహించినట్లు ఉన్నారు. ఆ తర్వాత అంతా తమకు నచ్చినట్లు గేమ్ ఆడటం, అవతలి వారితో కయ్యానికి కాలు దువ్వడం స్టార్ట్ చేశారు.
ఇంక నాగార్జున హోస్టింగ్‌పై కూడా గీతూ రాయల్ కామెంట్స్ చేసింది. అయితే అదంతా ఇప్పుడు కాదులెండి. గతంలో గీతూ రాయల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగార్జున హోస్టింగ్ మీద గీతూ ఏమందంటే.. “బిగ్ బాస్ హౌస్ లో నాని హోస్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఎన్టీఆర్ సీజన్ నేను చూడలేదు. ఆయన కూడా బాగా చేశారు అని చెప్తే విన్నాను. నాగార్జున గారికి రోస్టింగ్ రాదు. వాళ్లు ఎన్ని తప్పులు చేసినా కూడా నవ్వుతూ, సున్నితంగా రోస్ట్ చేస్తారు. హోస్టింగ్ అంటే నాకు నాని హోస్టింగే బాగా ఇష్టం. ఇంక కొత్తగా ఎవరైనా రావాలి అంటే రానా, విజయ్ దేవరకొండ కూడా బాగా చేస్తారు. నాగార్జున గారు మాత్రం చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. బిగ్ బాస్ ఆడియన్స్ కి కవాల్సింది వాళ్లని రోస్ట్ చేయడం. అది నాగార్జున గారు చేయరు” అంటూ గీతూ రాయల్ నాగార్జున హోస్ట్ గా పనికిరారని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం ఆ ఓల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.