మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన పూనకాలు లోడింగ్ మూవీ వాల్తేరు వీరయ్య. కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో బాస్ గ్రేస్, ఆ జోష్, ఆ యాటిట్యూడ్ చూసి మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? ఎప్పుడెప్పుడు రచ్చ రచ్చ చేయాలా అని ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, ఏసీపీ విక్రమ్ సాగర్ గా రవితేజ నటిస్తున్నారంటేనే.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించేసుకున్నారు. ఒక పక్క మెగాస్టార్, మరోపక్క ఎనర్జీ స్టార్ రవితేజ.. ఈ కాంబినేషన్ లో సినిమా అంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక పాటల విషయానికొస్తే.. నిజంగా పూనకాలు వచ్చేలా ఉన్నాయి. బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఓ రేంజ్ లో ఉంది. బాబీ డైరెక్షన్ అంటే కమర్షియల్ హంగులు ఉంటాయి. రవితేజతో చేసిన పవర్ ప్యాక్డ్ మూవీ పవర్.. ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. నాగచైతన్య, వెంకటేష్ లతో వెంకీ మామ సినిమా తీసి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తప్పితే.. మిగతా సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. అలాంటి కమర్షియల్ డైరెక్టర్.. కమర్షియల్ కి భారీ కటౌట్ అయిన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తే కమర్షియల్ కే మమ్మీ హస్బెండ్ అయి తీరుతుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమా బిగెస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్ సినిమా తరహా గెటప్స్ లో కనిపించనున్నారు. ఆ వింటేజ్ లుక్ ని చూడడం కోసమైనా సినిమా చూడాలని మెగా ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. సంక్రాంతి పండుగ అంటేనే సినిమా జాతర.. అందులోనూ మెగాస్టార్ సినిమా అంటేనే మెగా జాతర.. అందులో మళ్ళీ డబుల్ బొనాంజాగా చిరు, రవితేజ కలిసి వస్తున్నారు. అసలు పండగ వాల్తేరు వీరయ్యతోనే మొదలవుతుందని మెగా మాస్ అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్టు.. బాస్ కోసం, మాస్ మహారాజ్ కోసం వెయిటింగ్ అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ తో దుమ్ములేపుతున్నారు. చిరంజీవికి బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ అని, చిరు, రవితేజల కాంబినేషన్ కెవ్వు కేక అని, షో మొత్తం ఆకట్టుకుంటుందని, ఈ పండక్కి మాంచి మసాలా పాప్ కార్న్ సినిమా అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టోరీ, సంగీతం సూపర్బ్ గా ఉందని ట్వీట్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Boss following in Girls 🔥💥
Benefits show at Sandythreatre Hyderabad 🔥#WaltairVeerayyaOnJan13th #WaltairVeerayya #waltairveerayyareview #WaltairVeerayyaFDFS #WalterVeerayya pic.twitter.com/CgZez3dD4e— Sravan pspk, vj (@SRAVANPSPK16) January 13, 2023
Sanakranthi mogudu full fire#Megastar #WaltairVeerayyaOnJan13th#waltairveerayyareview#WaltairVeerayyausa #WaltairVeerayyaFDFS #Chiranjeevi #BlockbusterWaltairVeerayya#PoonakaaluLoading pic.twitter.com/mY6U45jY4W
— renu_tv9 (@renutv9) January 13, 2023