గతేడాది గాడ్ ఫాదర్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ కి ఫ్యాన్స్ కోసం ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రెడీ చేశాడు. మాస్ యాక్షన్ జానర్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాని.. డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ కాగా మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటించడంతో సినిమాపై హైప్ బాగా పెరిగింది. ఇప్పటికే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, మూవీ ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలు భారీగా సెట్ చేశాయి. తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ అయ్యింది. మరి ఈ మెగా ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
జాలరిపేటలో జనాల మనిషి వాల్తేరు వీరయ్య(చిరంజీవి). వీరయ్యకి తెలియకుండా కొందరు ఆ ఏరియాలో డ్రగ్స్ బిజినెస్ చేస్తుంటారు. వారిని పట్టుకోవడానికి ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) వస్తాడు. ఈ క్రమంలో వీరయ్య, ఏసీపీకి సంబంధించి ఓ షాకింగ్ ట్విస్టు తెలుస్తుంది. కట్ చేస్తే.. డ్రగ్స్ కేసులో వీరయ్యని ఇరికించి.. బిజినెస్ చేసిన అసలు నేరస్థులు దేశం వదిలి పారిపోతారు. జైలు నుండి బయటికి వచ్చాక.. వీరయ్య ఊహించని పరిణామాల మధ్య మలేషియాలో ఉన్న డ్రగ్ డీలర్స్ ని ఇండియాకి తీసుకురావడానికి వెళ్తాడు. ఈ క్రమంలో లవ్.. ఫ్యామిలీ ఎమోషన్స్ దాటుకొని వీరయ్య డ్రగ్ డీలర్స్ తో ఫైట్ చేస్తాడు. మరి ఆ ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్ ఎవరు? వీరయ్య మలేషియా వెళ్లి ఏం చేశాడు? అసలు విక్రమ్ సాగర్ కి, వీరయ్యకి మధ్య సంబంధం ఏంటి? చివరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.
చిరంజీవి సినిమా అంటే మెగాఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్, క్లాస్ ఏ వర్గానికి చెందిన ఆడియన్స్ అయినా మెగాస్టార్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయన ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ చేసినప్పటి నుండి ప్రతి సినిమాని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. బాస్ కంబ్యాక్ అయినా.. అన్నీ సీరియస్ సినిమాలే చేసుకుంటూ వెళ్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి టైంలో దర్శకుడు బాబీ.. మంచి ఫన్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో కూడిన వాల్తేరు వీరయ్య మూవీని తీసుకొచ్చాడు. చిరు నుండి ఎప్పటినుండో చూడాలని అనుకుంటున్న కామెడీ టైమింగ్ ని, డిఫరెంట్ గోదారి యాసతో డిసైన్ చేశారు.
గాడ్ ఫాదర్ లాంటి హిట్ తర్వాత మెగాస్టార్ నుండి వస్తున్న సినిమా.. పైగా రవితేజ కూడా కీలకపాత్ర అంటే హైప్ బాగా పెరిగిపోయింది. అలాగే ఫ్యాన్స్ ని మెచ్చే అంశాలు చాలా ఉన్నాయని చెప్పారు. సో.. వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ట్రైలర్ చూపించినట్లుగా ఇంటర్నేషనల్ డ్రగ్ డీలింగ్ టాపిక్ సినిమా మొదలవుతుంది. వాల్తేరు వీరయ్య క్యారెక్టర్ లో బాస్ ఎంట్రీ.. ఆ వెంటనే బాస్ పార్టీ సాంగ్ తో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లారు. అక్కడినుండి మెగాస్టార్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు అతిధి పాత్రలో హీరోయిన్ శృతిహాసన్ ఎంట్రీ.. ఆమెతో బాస్ లవ్ ట్రాక్ ఇవన్నీ చాలా సరదాగా కూర్చోబెడతాయి.
ఫస్టాఫ్ లో వీరయ్య క్యారెక్టర్ లో కామెడీని కంటిన్యూ చేస్తూనే.. కథలో సీరియస్ నెస్ క్రియేట్ చేశారు. అలా ఓవైపు ఫన్.. మరోవైపు మెయిన్ క్యారెక్టర్స్, విలన్ ఇంట్రడక్షన్స్ తో పాటు అదిరిపోయే ట్విస్టు, యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ డిజైన్ చేశారు. ఓరల్ గా ఫస్టాఫ్ బాస్ ఎంటర్టైన్మెంట్ తో ఫ్యాన్స్ పండగ చేసుకునే మూమెంట్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. వీరయ్య ఫ్లాష్ బ్యాక్.. వీరయ్యని సవాల్ చేస్తూ కథలోకి ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్ లో మాస్ రాజా రవితేజ ఇంట్రడక్షన్ బాగుంది. పక్కా నాటు తెలంగాణ యాసలో రవితేజ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ కిక్కిస్తాయి. అలా వీరయ్యకి, రవితేజకి మధ్య జరిగే సన్నివేశాలు నవ్విస్తూనే.. ఆసక్తి కలిగిస్తాయి.
అలా సెకండాఫ్ వీరయ్య, విక్రమ్ సాగర్ లతో సాగుతుండగా.. ఓ ఊహించని ట్విస్టు.. ఎమోషన్స్.. కంటతడి పెట్టించే సన్నివేశాలు.. ఎమోషనల్ సాంగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వీరయ్య మాస్ విశ్వరూపం డీసెంట్ గా చూపించి సాటిస్ఫాక్షన్ కలిగించారు. అయితే.. ఇందులో ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్ గా బాబీ సింహా, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్స్ ఉన్నంతలో బాగా డిజైన్ చేశారు. హీరోయిన్ శృతిని ఓ రా ఏజెంట్ గా చూపించారు. రా టీమ్ పట్టుకోవాలని చూస్తున్న డ్రగ్ డీలర్స్ ని వీరయ్య ఎంటర్ అవ్వడంతో పూర్తిగా మూవీ స్టోరీ అతని కంట్రోల్ లోకి వెళ్తుందని చెప్పాలి. వీరయ్య కథలో కొత్తదనం లేదు.. రివేంజ్ యాక్షన్ డ్రామానే. కానీ.. స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్, సాంగ్స్.. మాస్ ఎలిమెంట్స్ తో ఎంటర్టైన్ చేశారు.
ఇక మాస్, కామెడీ, డాన్స్ ఏదైనా బాస్ తర్వాతే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. మెగాస్టార్ అన్నివిధాలా ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని మెప్పించాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎనర్జిటిక్ గా ఉన్నాయి.. కానీ, బాస్ కి ఇంకా బెటర్ సాంగ్స్ పడాల్సింది అనిపిస్తుంది. బీట్, డాన్స్ అన్నీ ఉన్నాయి.. కానీ.. చిరు సాంగ్స్ లో సోల్ మిస్ అయ్యింది. అయినా.. ప్రతి సాంగ్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేసేలా జాగ్రత్తపడ్డారు. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు బాబీ చెప్పిన విధంగానే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా వీరయ్యని తెరపై ప్రెజెంట్ చేశాడని చెప్పవచ్చు. మైత్రి వారి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అనడానికి వీరయ్యని ఉదాహరణగా తీసుకోవచ్చు.
చివరిమాట: వీరయ్య.. అదరగొట్టాడు!
రేటింగ్: 4/5
మీ రివ్యూని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి