“ఏదైనా నేను దిగనంతవరకే- వన్స్ ఐ స్టెపిన్ హిస్టరీ రిపీట్స్”.. ఏ ముహుర్తాన ఈ డైలాగ్ బాలయ్యకు రాశారో.. ఆయన ప్రతిదాంట్లో దానిని నిజం చేసి చూపిస్తున్నారు. బాలయ్య హోస్టుగా ఆహాలో అన్‌స్టాపబుల్ అనే టాక్ షో రాబోతోంది అనే టాక్ బయకు రాగానే.. అంతా ముక్కున వేలేసుకున్నారు. బాలకృష్ణ ఏంటి? టాక్ షో చేయడం ఏంటని చెవులు కొరుక్కున్నారు. అయితే మొదట బాలయ్య కూడా తాను అసలు హోస్ట్‌గా సెట్ అవుతానా? అనే అనుమానాలను వ్యక్త పరిచారు. కట్ చేస్తే.. ఒక టాక్ షోని బాలయ్యలాగా మరెవ్వరూ చేయలేరని నిరూపించారు. తెలుగు టాక్ షోని పాన్ ఇండియాలెవల్లో కూర్చోబెట్టారు. ఇండియాలోనే నంబర్ వన్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ నిలిచింది.
అదే జోష్‌తో అన్‌స్టాపబుల్ సీజన్-2ని కూడా స్టార్ట్ చేశారు. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సీజన్-2ని బాలయ్య మొదలు పెట్టారు. తొలి ఎపిసోడ్‌తోనే దేశంమొత్తం ఆహావైపు తిరిగి చూసేలా చేశారు. సొంత బావ, అల్లుడిని అతిథులుగా తీసుకొచ్చి.. రికార్డులు బ్రేక్ చేశారు. ఒక్క సినిమాప్రియులు మాత్రమే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ అన్‌స్టాపబుల్ సజన్-2 పేరు మారుమ్రోగేలా చేశారు. అటు చంద్రబాబు సైతం ఛమత్కారం, పదునైన ప్రశ్నలు, సూటి సమాధానాలతో కాసేపు బాలయ్యను కూడా ఆడేసుకున్నారు. చంద్రబాబు ఒక రాజకీయ దిగ్గజంగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ, ఈ టాక్ షో ద్వారా చంద్రబాబు వ్యక్తిగత జీవితం, కాలేజీ రోజుల్లో చేసిన ఎన్నో తుంటరి పనులు, తీసుకున్న కఠిన నిర్ణయాలను తెలిసేలా చేసింది.
ఇప్పుడు ఈ అన్‌స్టాపబుల్ తొలి ఎపిసోడ్ ఓటీటీల్లో చరిత్ర సృష్టించింది. కేవలం నాగులు రోజుల్లో కోట్లలో స్ట్రీమింగ్ మినిట్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. అన్‌స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ స్టార్ అయిన నాలుగు రోజులకే 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకుంది. టీవీల్లో ఒక సినిమా, కార్యక్రమం రేటింగ్‌ని టీఆర్పీల్లో ఎలా అయితే చూస్తారో.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ మినిట్స్ ని బట్టి దాని రేటింగ్, రీచ్ ని లెక్కగడతారు. ఆ లెక్కన చూసుకుంటే ఓటీటీల్లో అన్‌స్టాపబుల్ నాలుగురోజుల్లో 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో ఇండియాలోని నంబర్ వన్ టాక్ షో అని మరోసారి నిరూపించుకుంది. “ అతను వచ్చాడు, శాసించాడు, చరిత్ర సృష్టించాడు.. దానినే మరోసారి రిపీట్ చేశాడు” అంటూ ఆహా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో అన్‌స్టాపబుల్ రికార్డు గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
He came. He ruled. He created history, yet again!!😎#UnstoppableWithNBKS2 episode 1 streaming now. #NBKOnAHA #NandamuriBalakrishna pic.twitter.com/h2oicuFZG4
— ahavideoin (@ahavideoIN) October 19, 2022