తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్లుగా పరిచయం అయ్యి.. హీరోలుగా మరిన నటులున్నారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి హీరోలుగా ఎదిగిన హీరోలు ఉన్నారు. కానీ హీరోలుగా చేసి విలన్లు గా మారిన నటులు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ అరుదైన కేటగిరిలోకే వస్తారు టాలీవుడ్ ఫ్యామీలి హీరో జగపతి బాబు. ముద్దుగా ఇండస్ట్రీ మెుత్తం జగ్గూ భాయ్ అని పిలుచుకుంటుంది. సినిమాల్లోనే కాక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటూ.. తనదైన శైలిలో కొటేషన్స్ వదులుతున్నాడు. ఉన్నది ఉన్నట్లుగా ఇండస్ట్రీలో మాట్లాడే వ్యక్తుల్లో జగపతి బాబు ఒకరు. అయితే తాజాగా జగ్గూభాయ్ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. తలకిందులుగా వేలాడుతూ..”ఇలాగైనా ఈ లోకం అర్ధం అవుతుందేమో అని చూస్తున్నా” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
జగపతి బాబు.. 90 వ దశకంలో కుటుంబ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా మహిళా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని.. ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్ వేయించుకున్నాడు. దాంతో అప్పట్లో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అయితే రాను రాను హీరోలుగా సినిమాలు తగ్గించిన జగ్గూ భాయ్.. విలన్ వేశాలపై తన దృష్టి పెట్టాడు. తొలిసారిగా బోయపాటీ శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో.. పవర్ ఫుల్ విలన్ రోల్లో తెరపై కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి పవర్ ఫుల్ విలన్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. దాంతో వరుసగా విలన్ రోల్స్ తో మెప్పిస్తూనే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే తనలోని భావాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూంటాడు. తాజాగా తాడుతో తలకిందులుగా వేలాడుతున్న ఓ ఫొటోను తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసి దానికి..”ఇలా తలకిందులుగా చూస్తేనైనా ఈ లోకం అర్దం అవుతుందేమో అని చూస్తున్నా” అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “ఏంటి జగ్గూ భాయ్ ఈ లోకం నీకు అర్ధం కావట్లేదా?” అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరేమో..”మీరు ఎన్ని ఆసనాలు వేసినా ఈ లోకం మీకు అర్దం కాదు” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే జగపతి బాబు తన ఇంటర్య్వూల్లో చాలా సార్లు సమాజంపై తనకున్న కోపాన్ని తన మాటల్లో తెలియజేసిన సందర్బాలున్నాయి. ఇక ప్రస్తుతం జగ్గూ భాయ్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జగ్గూ భాయ్ లుక్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. రాజమన్నార్ లుక్ లో జగ్గూ భాయ్ అతి భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు జగపతి బాబు మరికొన్ని చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
ila aina ee lokam ardham avutundhemo ani choosthunna. pic.twitter.com/f2jOte3QGl
— Jaggu Bhai (@IamJagguBhai) October 18, 2022