ఇటీవలే బుల్లితెర నటి వైశాలి టక్కర్(29) ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ బ్యూటీ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్ గురిచేసింది. వైశాలీ మరణ వార్త ఆమె అభిమాలను విషాదంలో ముంచింది. ‘ససురల్ సిమర్ కా’ అనే సీరియల్ ద్వారా వైశాలి మంచి గుర్తింపు సంపాదించింది. ఇండోర్ లోని తేతేజి నగర్ పోలీస్టేషన్ లో వైశాలి మరణంపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే ఇప్పటికే ఆ సూసైడ్ నోట్ ను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అందులోని సమాచారంతో పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో తాజాగా వైశాలి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ బయటకి వచ్చింది.
నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ప్రధాన నిందితుడు రాహుల్, అతడి భార్య దిశలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా వారిద్దరిపై పోలీసులు లుక్ అవుట్ నోటిసులు జారీ చేశారు. రాహుల్ నవ్లానీ, దిశపై నోటీసులు జారీ అయినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. వైశాలి కేసులో నిందితుల ఒక్కొక్కరిపై రూ.5 వేల రివార్డును సైతం ప్రకటించారు. వీరి సమాచారం తెలిపిన వారికి రూ.5వేల ఇస్తామని పోలీసులు తెలిపారు. తీవ్రమైన నేరాల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తుంటారు. వైశాలి ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ప్రధాన నిందితులుగా రాహుల్, అతడి భార్య దిశను పోలీసులు గుర్తించారు.
తన చావుకు కారణం రాహుల్, అతడి భార్య అంటూ వైశాలి ఆ లేఖలో రాసింది. ఇంకా వైశాలి సూసైడ్ నోట్ లో ఏం రాసిందంటే…”నన్ను రెండున్నరేళ్లుగా పక్కింట్లో ఉండే రాహుల్ అనే వ్యక్తి మానసికంగా వేధిస్తున్నాడు. నేను చనిపోయాక రాహుల్ ని, అతని భార్యని శిక్షించడం మర్చిపోవద్దు. నా చావుకి రాహులే కారణం” అంటూ తన తల్లిదండ్రులకు లేఖలో చెప్పుకొచ్చింది వైశాలి. ఈ నేపథ్యంలో అసలు రాహుల్ ఎవరు అని ఆరా తీయగా.. వైశాలి మాజీ ప్రియుడని తెలిసింది. అదీగాక వైశాలి చివరి ఇన్ స్టాగ్రామ్ వీడియోలో కూడా తాను బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయినట్లు చెప్పిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ నిందితులపై పోలీసుల లుక్ అవుట్ నోటిసులు జారీ చేశారు.