SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Details And Facts About Rishab Shetty Kantara Movie Story

Kantara: కాంతార కథ నిజమా? అబద్ధమా? దేవుళ్ళు- ఆత్మలతో ఆ తెగవారు మాట్లాడుతారా?

    Updated On - Wed - 19 October 22
  • |
      Follow Us
    • Suman TV Google News
Kantara: కాంతార కథ నిజమా? అబద్ధమా? దేవుళ్ళు- ఆత్మలతో ఆ తెగవారు మాట్లాడుతారా?

“కాంతార”.. ఇప్పుడు ఈ మాట దేశాన్ని ఊపేస్తోంది. నిజానికి మన అందరికీ ఇది కేవలం ఒక సినిమానే కావచ్చు. కానీ.. ఈ సినిమా కర్ణాటక ప్రాంతంలో నివశించే ఒక తెగ జీవన విధానానికి అనుసంధానమై ఉంది. వారి కళలకి, నమ్మకాలకి, సంస్కృతులకి “కాంతార” ఒక నిలువుటద్దంలా నిలిచింది. అయితే.. “కాంతార” నిజంగా జరిగిన కథేనా? మంగళూరు ప్రాంతంలో ఉండే “తుళు” పరంపర ప్రజలకి నిజంగానే ఆత్మలు కనిపిస్తాయా? అసలు కాంతారలో మనం చూసిన డ్యాన్స్ కి, దేవుడికి సంబంధం ఏంటి? మనిషిలోకి దేవుడు రావడం ఏంటి? అందరూ చూస్తుండగా ఆ మనిషి మాయం అవ్వడం ఏంటి? మూడు దశాబ్దాల క్రితం ఈ రిషబ్ శెట్టి సొంత ఊరులో జరిగిన సంఘటన ఏంటి..? ఇలాంటి అన్నీ విషయాలకి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

“కాంతార” కట్టు కథా? కాదా? అనే విషయంలోకి వెళ్లే ముందు మనం కొన్ని విషయాలు గురించి మాట్లాడుకుందాం. మన ఊర్లలో అమ్మవారి ఊరేగింపులో ఉన్నట్టుండి మహిళలకి అమ్మవారు ఆవహిస్తుంటుంది. ఆ సమయంలో ఆ స్త్రీ అసామాన్యంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బక్క పలచగా ఉండే ఆమెని పట్టుకోవడానికి 10 మంది కూడా సరిపోరు. ఆ సమయంలో ఆమె బిందెడు పసుపు నీళ్లు అవలీలగా తాగుతుంది. మాములుగా అయితే.. ఓ వ్యక్తి అన్ని నీళ్లు తాగగలరా? పూనకం వచ్చిన సమయంలో ఆ స్త్రీలో అంతటి శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న! కానీ.., మనలో చాలా మంది ఈ విషయాన్ని అస్సలు సీరియస్ గా తీసుకోరు. నిజానికి.. ఇలా అమ్మవారు ఒంట్లోకి వచ్చి గ్రామాల్లో జరుగుతున్న ఎన్నో అన్యాయాలను బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?

Kantaara movie culture story

ఇక హైదరాబాద్ అంతటా అత్యంత వైభంగా జరిగే “లష్కర్ బోనాల” జాతర అందరికీ తెలుసు కదా? అప్పుడు జరిగే “రంగం” కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సైతం హాజరవుతుంటారు. అక్కడ అమ్మవారి భక్తురాలు చెప్పే “భవిష్యవాణి” పొల్లు పోకుండా జరిగిన సందర్భాలు ఎన్ని లేవు? నిజానికి ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగే, జరుగుతున్న అద్భుతాలే. కానీ.., మనలోని శాస్త్రీయ కోణం ఆ నిజాలను ఒప్పుకోనివ్వదు. అయితే.., ఈ జాతరలో వచ్చే పూనకాలను, బోనాల సమయంలో చెప్పే భవిష్యవాణిని కనీసం మన సంస్కృతి, సాంప్రదాయంగా ఎందుకు చూడలేకపోతున్నాం?  సంస్కృతి, సాంప్రదాయాలు అంటే.. నిజాలు, అబద్ధాలు కాదు. మనం పెరిగిన జీవిన విధానం కదా. ఇదే పాయింట్ ని రిషబ్ శెట్టి తన కథా వస్తువుగా మార్చుకున్నాడు. తమ పూర్వీకుల నమ్మకాలను “కాంతార” కథకి ముడి సరుకుగా మార్చుకున్నాడు.

కన్నడ నటులైన “అనుష్క శెట్టి, కృతి శెట్టి, రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, శ్రీనిధి శెట్టి, ఐశ్వర్య రాయ్” వీళ్లంతా మీకు తెలుసు కదా? కాంతార మూవీ కథ వీరందరి పూర్వీకుల చరిత్ర. వీరి కులం పేరు “బంట్”. వీరి భాష తుళు. నిజానికి బంట్ అంటే పోరాటం అని అర్థం. వీరంతా తరువాత కాలంలో మూడు రకాలుగా విడిపోయారు. కొంతమంది మతాన్ని కూడా మార్చేసుకున్నారు. కానీ.., వీరందరూ ఈ నాటకీ ఉమ్మడిగా నమ్మే నమ్మకం పేరు మాత్రం “కంబళ”. కాంతార మూవీలో మనం చూసిన నృత్యం పేరే “కంబళ”. భూతకళలో ఇదీ ఒకటి. తమ కులంలో మరణించిన పూర్వీకులు తమ చుట్టే ఆత్మల్లా తిరుగుతూ.. తమకి సంకేతాలు పంపిస్తూ ఉంటారని వీరి నమ్మకం.

“కంబళ”లాంటి జానపద నృత్యంతో ఆరాధిస్తే.. తమ పూర్వీకులు కోలం కట్టిన వారిలోకి ఆవహిస్తారని, వారే ఆ సమయంలో తమ దైవం అని వీరి నమ్మకం. నిజానికి యక్షగానాల్లో ఒకటైన ఈ కళని ప్రదర్శించడం అంత సులభం కాదు. ఇది అందరికీ వచ్చే విద్య కూడా కాదు. అందుకే  ఇప్పుడు ఈ “కోలం” కట్టే వారి సంఖ్య దాదాపుగా అంతరించిపోయే స్థితికి వచ్చేసింది. తమ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఇలాంటి ఓ కళని కాపాడుకోవడానికి రిషబ్ శెట్టి.. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసిన గొప్ప ప్రయత్నమే “కాంతార”. అయితే.. సినిమాలో చూపించినట్టు కోలం కట్టిన మనిషి మాయం అవ్వడం అనేది నిజంగా జరిగింది కాదు. రిషబ్ శెట్టి సొంత గ్రామంలో సుమారు 3 దశాబ్దాల క్రితం కొన్ని ఘటనలు జరిగాయట. అక్కడ కోలం కట్టిన అతను చెప్పినట్టే కొంతమంది వ్యక్తులు అకాల మరణం చెందినట్టు సమాచారం. ఆ ఘటనలు ఆధారంగానే రిషబ్ శెట్టి కాంతార కథని అల్లుకున్నాడు.

Kantaara movie culture story

ఒకరకంగా చూస్తే “కాంతార” మనకి తెలియని కథ కాదు. మనకి గ్రామాల్లో సోది చెప్పే వాళ్ళు ఉంటారు. సోదిలో కూర్చున్న తరువాత వారిలోకి మన పూర్వీకులు వస్తారు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. ఒక్కోసారి వారిలోకి మన కులదైవం కూడా వస్తుంది. పోగొట్టుకున్న వస్తువు ఏ దిక్కున ఉందో చెప్తుంది. ఆ సోది ప్రకారం ఆ దిక్కుగా వెళ్తే పోగొట్టుకున్న వస్తువులు దొరికిన సందర్భాలు కొన్ని వందల్లో ఉన్నాయి. కానీ.., సోది అయ్యాక మాత్రం ఆ వ్యక్తి అమాయకంగా మనం ఇచ్చే చిల్లర డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటుంది! నిజానికి కాంతార సినిమాలో చూపించింది కూడా ఇదే కదా? సో.. కాంతార కథ అబద్ధం కాదు, కొత్తది అంతకన్నా కాదు. కాంతారా నిజమైన కథే. ఇంకా చెప్పాలంటే మనకి తెలిసిన కథే. కాకుంటే.. మనం మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు పట్టించుకోవడం లేదు, కన్నడ వాళ్ళు పట్టించుకున్నారు అంతే తేడా.

  • ఇదీ చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం! మంచి పేరు తెచ్చుకున్న సీరియల్ నటి ఆత్మహత్య!
  • ఇదీ చదవండి: నేషనల్‌ క్రష్‌పై మనసుపడ్డ బాలయ్య.. ఆమే నా క్రష్‌ అంటూ..!
  • ఇదీ చదవండి: వైరల్ అవుతున్న కింగ్ నాగార్జున, లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి ఫోటో..!

Tags :

  • kannada
  • Kantara
  • Kantara Movie
  • Movie News
  • Rishab Shetty
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు!

ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు!

  • వీడియో: ‘బిబి జోడి’లో వార్! స్టేజ్ పై ఏడ్చేసిన భానుశ్రీ!

    వీడియో: ‘బిబి జోడి’లో వార్! స్టేజ్ పై ఏడ్చేసిన భానుశ్రీ!

  • బ్రేకింగ్: తారకరత్న ఆరోగ్యస్థితిపై నారాయణ డాక్టర్స్ లేటెస్ట్ బులెటిన్!

    బ్రేకింగ్: తారకరత్న ఆరోగ్యస్థితిపై నారాయణ డాక్టర్స్ లేటెస్ట్ బులెటిన్!

  • జమున బయోపిక్ తీసే యోచనలో టాప్ డైరెక్టర్! హీరోయిన్ గా ఎవరంటే?

    జమున బయోపిక్ తీసే యోచనలో టాప్ డైరెక్టర్! హీరోయిన్ గా ఎవరంటే?

  • ‘దసరా’ టీజర్ ఈవెంట్ లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

    ‘దసరా’ టీజర్ ఈవెంట్ లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..
vs-icon

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!
vs-icon

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..
vs-icon

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..

తాజా వార్తలు

  • వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు!

  • 13 గంటలు గాల్లో ప్రయాణించిన ఫ్లైట్.. మళ్లీ టేకాఫ్ అయిన చోటుకే! ఎందుకంటే?

  • ముక్కు అవినాష్ పై నటి సదా సీరియస్! వీడియో వైరల్!

  • రెండో గర్ల్ ఫ్రెండ్ తోనూ టీమిండియా క్రికెటర్ బ్రేకప్? ప్రియురాలి పోస్ట్ వైరల్..

  • కేవలం రూ. 6 పొదుపుతో మీ బిడ్డని లక్షాధికారి చేయొచ్చు.. ఈ పథకం మీ కోసమే!

  • బాయ్ ఫ్రెండ్ తో నగ్నంగా భార్య! ఆ వీడియోలు చూసిన భర్త ఏం చేశాడంటే?

  • బ్రేకింగ్: గ్రూప్-4 ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు..

Most viewed

  • అభిమాన నాయకుడి ఫొటోను టాటూగా వేయించుకున్న హీరో విశాల్

  • అబార్షన్ కోసం ఆర్ఎంపీ వద్దకు వెళ్లిన వివాహిత! అతడు చేసిన పనికి..

  • ఆస్కార్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా? మొత్తం రూల్స్ ఇవే!

  • బాలీవుడ్ మూవీలో విలన్ గా కరీంనగర్ కుర్రాడు.. ట్రైలర్ లాంఛ్‌ చేసిన ఎన్.శంకర్!

  • ఆస్కార్ నామినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కు నిరాశ!

  • అమ్మకు రెండో పెళ్లి చేసిన కొడుకు.. నెట్టింట వైరలవుతోన్న స్టోరీ!

  • వరల్డ్ కప్ ఉంది..ఈసారి IPLలో ఆ ప్లేయర్స్ కి అనుమతి ఉండదు: రాహుల్ ద్రవిడ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam