సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, నిర్మాతలపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అవకాశాల పేరుతో మోసం చేశారని, నాతో తప్పుగా ప్రవర్తించారని విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. టాలీవుడ్‌లో ఇలాంటివి తక్కువేగానీ, బాలీవుడ్ లాంటి వాటిలో అయితే ఇలాంటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పేరు బాగా వినిపిస్తోంది. అతను ఎప్పుడైతే హిందీ బిగ్ బాస్ 16లో సభ్యుడిగా అడుగు పెట్టాడో అప్పటి నుంచి అతనిపై ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు అతనిపై విమర్శలు గుప్పించగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది. భోజ్‌పురీ నటి రాణీ ఛటర్జీ సాజిద్ ఖాన్‌పై తీవ్ర విమర్శలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతనిపై దుమ్మెత్తి పోసింది.
నిజానికి.. సాజిద్ ఖాన్ లాంటి వ్యక్తిని బిగ్ బాస్‌లోకి ఎలా తీసుకుంటారంటూ.. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూనే.. మరోవైపు సాజిద్ ఖాన్ తమను ఇలా చేశాడంటూ వారి బాధలను చెప్పుకుంటున్నారు. తాజాగా రాణీ ఛటర్జీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాణీ ఛటర్జీ.. సాజిద్ ఖాన్ హిమ్మత్ వాలా సినిమాలో ‘ఢోకా ఢోకా’ అనే ఐటమ్ నంబర్ నటించింది. ఆ సాంగ్ కి తనని సెలక్ట్ చేసే సమయంలోనే సాజిద్ తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించింది. సాంగ్‌కి సంబంధించిన విషయం అంటూ తనని ఇంటికి ఒంటరిగా పిలిచినట్లు చెప్పింది.
“హిమ్మత్ వాలాలో ఢోకా ఢోకా సాంగ్ కోసం నన్ను తన ఇంటికి ఒంటరిగా రమ్మన్నాడు. అతను గొప్ప దర్శకుడు కావడంతో నేను అతను చెప్పినట్లుగానే వెళ్లాల్సి వచ్చింది. తన ఇంటికి వెళ్లినప్పుడు ఒక్కడే ఉన్నాడు. నన్ను ఢోకా ఢోకా ఐటమ్ నంబర్‌కి తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. నన్ను నా కాళ్ల అందాన్ని చూపించమని అడిగాడు. స్పెషల్ సాంగ్ అంటే చిన్న చిన్న స్కట్లు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అలా అడిగారేమో అని నేను నా లాంగ్ ఫ్రాక్‌ని మోకాళ్ల వరకు పైకి ఎత్తి చూపించాను. ఆ తర్వాత అతను నా వక్షోజాల గురించి మాట్లాడాడు. వాటి సైజ్ గురించి కామెంట్ చేశాడు. బాయ్ ఫ్రెండ్‌తో సె*క్స్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటూ మాట్లాడాడు. నిజానికి ఇలాంటివి జరుగుతాయని నేను వినడమే తప్ప నాకు ఎప్పుడూ జరగలేదు. నేను కాసేపు ఏం మాట్లాడకుండా ఉండిపోయాను.” అంటూ రాణీ ఛటర్జీ ఆరోపణలు చేసింది. ఇటీవలే షెర్లీన్ చోప్రా, తనూశ్రీ వంటి నటీమణులు సైతం సాజిద్‌పై ఆరోపణలు చేశారు.