సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అన్నాక గ్లామర్ అనేది సినిమాలో చూపించడం వేరు. అదే హీరోయిన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా గ్లామర్ ఒలికిస్తే.. కొన్నిసార్లు అభిమానుల పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. ఆ హీరోయిన్ అందాన్ని చూసి మైమరచిపోయే ఫ్యాన్స్ కొందరు.. మొదటిసారి చూసినా అదే హీరోయిన్ని ఫాలో అయ్యేవారు ఇంకొందరు. అయితే.. సినిమాలున్నా లేకపోయినా గ్లామర్ షో చేయడం అనేది కొందరికే సాధ్యం. ఆ జాబితాలో ఎప్పుడూ ముందువరుసలో ఉండే హీరోయిన్ నేహా శర్మ. రామ్ చరణ్ సరసన చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బిహారి భామ.. కొంతకాలంగా సోషల్ మీడియాలో తన అందచందాలతో సెగలు రేపుతోంది.
నేహా తెలుగులో చేసింది రెండే సినిమాలు.. చిరుత, కుర్రాడు. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. కానీ, పెద్దగా హిట్స్ లేకపోవడంతో అడపాదడపా సినిమాలు చేసింది. అయితే.. సినిమాలలో తక్కువ కనిపించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది నేహా. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలకు సంబంధించి పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఇక్కడ గ్లామర్ ప్రియులకు ప్లస్ ఏంటంటే.. నేహా ఎప్పుడు ఫోటోలు పెట్టినా.. టాప్ టు బాటమ్ అందాలన్నీ కెమెరా ముందు పెట్టేసి కిక్కిస్తుంటుంది.
ఈ నేపథ్యంలో నేహా మరోసారి అభిమానులకు ట్రీట్ ఇస్తూ కొత్త ఫోటో ఒకటి షేర్ చేసింది. ఆ ఫోటోలో నేహా అందాలను చూస్తూ.. నెటిజన్స్ కైపెక్కిపోతున్నారు. మొదట్లో టాప్ టు బాటమ్ ఫార్మల్, ట్రెడిషనల్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకున్న నేహా.. ఈ మధ్యకాలంలో బీచులు, బికినీలు అంటూ నెక్స్ట్ లెవెల్ అందాలను ఆరబోస్తోంది. తాజాగా పోస్ట్ లో నేహా.. ఏమాత్రం లేకుండా అడ్డుగా ఉన్న వైట్ టాప్ ని తొలగించి మరీ ఎద సోయగాలను ప్రదర్శితం చేసేసింది. నేహాలోని అంత హాట్ నెస్ చూసేసరికి ఏమని కామెంట్స్ చేయాలో తెలియక అలా చూస్తూ ఆస్వాదిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ బోల్డ్ బ్యూటీ మున్ముందు ఏదైనా తెలుగు సినిమాలో కనిపిస్తుందేమో చూడాలి!