మగవారితో పోల్చుకుంటే మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. శారీరకంగా, మానసికంగా మహిళలు ఉన్నంత బలంగా మగవాళ్ళు కూడా ఉండరు. అంత ఆరోగ్యంగా ఉండే మహిళలు కూడా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్, మాయోసైటిస్ వంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలే సమంత మాయోసైటిస్ సమస్య నుంచి కోలుకుని బయటకు రాగా.. తాజాగా పూనమ్ కౌర్ ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఫైబ్రోమైయాల్జియా అనేది నాడీ సంబంధిత సమస్య. దీని వల్ల అలసట, నిద్ర, జ్ఞాపక శక్తి, మానసిక స్థితి, కండరాల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఫైబ్రోమైయాల్జియా మెదడు, వెన్నెముకపై కూడా ప్రభావం చూపుతుందని, నొప్పి కలిగించే, నొప్పి కలిగించని సంకేతాలు ఈ వ్యాధి లక్షణాలని పరిశోధకులు చెబుతున్నారు. ఏ వ్యాధి ముదిరితే.. విపరీతంగా నొప్పులు వస్తాయని అంటున్నారు. శారీరక గాయం అయిన తర్వాత గానీ, సర్జరీ, ఇన్ఫెక్షన్ లేదా మానసిక ఒత్తిడి వంటి సంఘటనల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి సంఘటనలు లేకుండానే వ్యాధి లక్షణాలు మొదలవుతాయి. మగవారితో పోలిస్తే.. ఈ ఫైబ్రోమైయాల్జియా అనేది ఆడవారిలో త్వరగా సంక్రమిస్తుంది. ఫైబ్రోమైయాల్జియా ఉన్నవాళ్లు టెన్షన్ హెడేక్, టెంపోరోమండిబ్యులర్ జాయింట్ (తాత్కాలిక ఎముక మరియు దిగువ దవడ) రుగ్మతలు, ప్రేగు సంబంధిత రుగ్మతలు, ఆందోళన, డిప్రెషన్ కలిగి ఉంటారు. ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి చికిత్స లేనప్పటికీ.. కొన్ని రకాల మందులతో వ్యాధి లక్షణాలను నయం చేయవచ్చు. వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం, రిలాక్స్ అవ్వడం వంటివి చేస్తే ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు.
ఫైబ్రోమైయాల్జియా ఇతర పరిస్థితులతో కూడా కలిసి ఉంటుంది. దీర్ఘకాలిక అలసట, ప్రేగు సంబంధిత సమస్య, మైగ్రేన్ మరియు ఇతర రకాల తలనొప్పులు, ఇంటర్స్టిషియల్ సైస్టిటిస్ లేదా పెయిన్ ఫుల్ బ్లాడర్ సిండ్రోమ్ (మూత్రాశయ సమస్యలు), టెంపోరోమండిబ్యులర్ జాయింట్ (తాత్కాలిక ఎముక మరియు దిగువ దవడ) రుగ్మతలు, ఆందోళన, డిప్రెషన్, పోస్చురల్ టాచీ టాకీకార్డియా (భంగిమకు సంబంధించిన సమస్యలు) వంటివి ఈ వ్యాధి లక్షణాలు.
ఫైబ్రోమైయాల్జియా వ్యాధి కారణాలు: