ఎవరైనా సరే పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉంటేనే.. నచ్చింతి తింటూ నచ్చినట్లు ఉండగలరు. ఇక కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు వ్యాధుల బారిన పడుతుంటాయి. దీనికి ప్రజలు, సెలబ్రిటీలు అనే డిఫరెన్స్ ఏం ఉండదు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డానని స్వయంగా ఆమెనే వెల్లడించింది. ఇప్పుడు మరో హీరోయిన్ అరుదైన ధీర్ఘకాలిక వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. దీన్ని ఆమె బయటపెట్టలేదు కానీ కొన్ని అందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ ఈమె గెలుచుకుంది. దీంతో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, తన సినిమలో ఈమెకు ఛాన్సిచ్చాడు. అలా ‘మాయాజాలం’తో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, ఈనాడు, గణేష్, నాగవల్లి, గగనం, ఆడు మగాడ్రా బుజ్జి, నాయకి, నెక్స్ట్ ఏంటి? లాంటి సినిమాలు చేసింది. ఈ ఏడాది కూడా ‘నాతిచరామి’ చిత్రంతో ఎంటర్ టైన్ చేసింది. నటిగానే కాకుండా అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై, చేనేత కార్మికుల కష్టాలపైనా గొంతు విప్పుతూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తోంది. ఇవన్నీ ఇప్పుడు పక్కనబెడితే.. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపించింది.
గత రెండేళ్ల నుంచి పూనమ్ కౌర్.. ఫైబ్రో మైయాల్జియా అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితి సమస్యలు, కండరాల నొప్పి లాంటి ఇబ్బందులు వస్తాయట. దీన్ని క్యూర్ చేసేందుకు ప్రస్తుతం కేరళలో పూనమ్ ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నట్లు కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. ఆయుర్వేద మందులు తీసుకుంటూ.. ఎక్సర్ సైజ్, టాకింగ్ థెరపీ లాంటివి పూనమ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎప్పటినుంచో సీక్రెట్ గా ఉంచినప్పటికీ.. తాజాగా ఫొటోలు కొన్ని బయటకు రావడంతో ఇది కాస్త రివీల్ అయింది.