స్నేహం.. వర్ణించడానికి పదాలు సైతం సరిపోవు. అలాంటి స్నేహం ఇద్దరి మధ్య చిగురిస్తే చాలు.. ఫ్రెండ్ కోసం తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడతారు. ఈ క్రమంలో సెలబ్రిటీల్లో సైతం స్నేహితులు ఉంటారు. కానీ కొంత మంది మాత్రమే చాలా డీప్ గా తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. పలు సందర్భాల్లో వారు ఒకరిపై ఒకరికి ఉన్న అభిమాన్నాన్ని, గౌరవాన్ని తెలియజేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అలాంటి మంచి స్నేహితులు ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చేది గోపీచంద్- ప్రభాస్ లే. మరి వారిద్దరికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇండస్ట్రీ లో డార్లింగ్ ప్రభాస్, హీరో గోపీచంద్ మంచి స్నేహితులనే సంగతి మనందరికి తెలిసిందే. ‘వర్షం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తమ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా కలిసి టైం స్పెండ్ చేస్తుంటారు. ఈ క్రమంలో నే తాజాగా ఐమాక్స్ లో హాలీవుడ్ మూవీని సైతం ఇద్దరు కలిసి చూశారు.
అయితే గోపీచంద్ ఇంట్లో ఎలాంటి వేడుక జరిగినా ప్రభాస్ కచ్చితంగా రావాల్సిందే. తాజాగా ప్రభాస్ కారు గోపీచంద్ ఇంటిముందు కనిపించింది. దీంతో డార్లింగ్ గోపీచంద్ ఇంటికి ఎందుకు వెళ్లాడా? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా ప్రభాస్ గోపీచంద్ ను కలిశాడు. అందుకు కారణం డార్లింగ్ కు గోపీచంద్ చిన్న కొడుకు వియాన్ అంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు అతడితో ఆడుకోవడానికి గోపీచంద్ ఇంటికి వస్తూ ఉంటాడని సన్నిహితులు చెప్తున్నారు.
ప్రభాస్ దగ్గర లంబోర్ఘిని అనే విలువైన కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ కారులోనే గోపీచంద్ ఇంటికి వెళ్లారాయన. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఈ కారు ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి. ప్రస్తుతం అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, లాంటి భారీ పాన్ ఇండియా మూవీస్ లతో బిజీగా ఉన్నాడు. ఇక గోపీచంద్ విషయానికి వస్తే శ్రీవాస్ దర్శకత్వంలో ‘లక్ష్యం 2’ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ని పనులతో బిజీగా ఉన్నా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్న డార్లింగ్ ప్రభాస్, హీరో గోపీచంద్ ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Best friends #Prabhas & #Gopichand watched #TopGunMaverick at Prasads Imax! pic.twitter.com/oScdH7dkYl
— Censor Talk (@TheCensorTalk) August 3, 2022