ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన వాళ్లు, ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్లు ఏవరైనా.. జీవితంలో ఒకానొక సమయంలో డిప్రెషన్ కు గురయ్యే ఉంటారు. తారల ఉరుకుల పరుగుల జీవితం, రంగుల ప్రపంచంలో ఈ డిప్రెషన్ అనేది సాధారణంగా ఉండేదే. ఇందుకు ఇండియన్ సినిమాలోనే అత్యంత బిజీ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపికా పదుకొణె కూడా అతీతురాలేమీ కాదు. ఆమె జీవితంలోని చీకటి రోజుల గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఇటీవల మానసిక ఆరోగ్యం గురించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్ని దీపికా పదుకొణె మరోసారి తన డిప్రెషన్ రోజులను గుర్తు చేసుకుంది. ఆమె మానసిక రుగ్మత గురిచిం ప్రస్తావిస్తూ.. “హీరోయిన్ గా నా కెరీర్ ఎంతో బాగుండేది. కానీ, నాకు ఎందుకో ఏదో తెలియని బాధ ఉండేది. బాగా ఏడుపొచ్చేది.. ఎందుకు ఏడుస్తున్నానో తెలిసేది కాదు. ఆ బాధను మర్చిపోయేందుకు నిద్రపోవాలనుకునే దాన్ని. ఎందుకంటే నిద్రలో అన్ని బాధలను మర్చిపోవచ్చు” అంటూ చెప్పుకొచ్చింది. #DeepikaPadukone spotted in city @viralbhayani77 pic.twitter.com/43nhdjRr1A — Viral Bhayani (@viralbhayani77) August 4, 2022 తన జీవితంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నట్లు తెలియజేసింది. “ఆ సమయంలో నన్ను ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు నన్ను బాగా వేధించేవి. అప్పుడప్పుడు అమ్మానాన్న నన్ను చూసేందుకు ముంబయి వచ్చేవాళ్లు. వాళ్ల ముందు మాత్రం ఎంతో హుషారుగా ఉండేదాన్ని. ఓరోజు అమ్మ ఎదుట దొరికిపోయాను. ఏం చెప్పాలో తెలియలేదు. అమ్మ కెరీర్ లో ఇబ్బందులు అనుకుంది. కానీ, నా బాధకు అవేమీ కారణం కాదు. చివరకు అమ్మ సహాయంతో నేను డిప్రెషన్ నుంచి బయట పడగలిగాను.” అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. దీపికా పదుకొణె సినిమాల విషయానికి వస్తే.. సర్కస్, బ్రహ్మాస్త్ర, జవాన్ సినిమాల్లో స్పెషల్ క్యామియో రోల్ లో సందడి చేయనుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్-K సినిమాలో దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని తెలుగు, హిందీలో ఒకేసారి రూపొందిస్తున్నారు. డిప్రెషన్ విషయంలో దీపికా పదుకొణె చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. .@deepikapadukone gets emotional as she talks about facing suicidal thoughts during the depression #DeepikaPadukone #depression #MentalHealthMatters pic.twitter.com/gQos75ra6v — First India filmy (@firstindiafilmy) August 5, 2022 ఇదీ చదవండి: హీరోయిన్‌గా మారిన రెండేళ్లకే మరణం.. సిమ్రాన్ చెల్లెలి చావుకు కారణం ఏంటి? ఇదీ చదవండి: రాఖీ కట్టిన వ్యక్తితో వివాహేతర సంబంధం.. మాజీ భార్యపై బుల్లితెర నటుడు సంచలన ఆరోపణలు..