మెగాస్టార్ చిరంజీవి– గరికపాటి నరసింహారావు వివాదం చినికి చినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. అలయ్ బలయ్ కార్యక్రమంలో “చిరంజీవి గారు ఆ ఫొటో సెషన్ ఆపేసి వచ్చి కూర్చుంటేనే నేను మాట్లాడతాను. లేదంటే సెలవు ఇప్పించండి వెళ్లిపోతాను” అంటూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గరికపాటి నరసింహారావు ప్రవర్తించిన తీరుపై ప్రముఖుల నుంచి మెగా అభిమానుల వరకు అంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి నరసింహారావు- మెగాస్టార్ చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఉత్తేజ్లాంటి వారు అయితే గరికపాటికి ఓపెన్ లెటర్ కూడా రాశారు. మీరు అలా ప్రవర్తించి ఉండకూడదంటూ సున్నింతగా చెప్పుకొచ్చారు.
ఈ ఘటన జరిగిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు సైతం స్పందించారు. “ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే” అంటూ నాగబాబు సైతం పరోక్షంగా కౌంటర్ వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగా అభిమానులు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై స్పందించిన గరికపాటి.. వివాదంపై నేను చిరంజీవితో మాట్లాడతాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ, అభిమానులు మాత్రం.. ఎలాగైనా గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ వివాదం కాస్తా ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో ఈ విషయంలో మళ్లీ మెగా బ్రదర్ నాగబాబు కలగజేసుకున్నారు. ఎవరూ తొందరపడకండి అంటూ ఫ్యాన్స్ కు నాగబాబు సూచన చేశారు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022
“గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు, అయనలాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగా అభిమానులకు నా రిక్వెస్ట్” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఆయన అలా మాట్లాడటం తప్పు అని తెలిజెప్పాలి అనుకున్నాం గానీ, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని తమకు లేదంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ కూడా గరికపాటి నరసింహారావు గురించి సోషల్ మీడియా వేదికా తప్పుగా మాట్లాడవద్దంటూ విజ్ఞప్తి చేశారు. మరి.. నాగబాబు కలగజేసుకుని చేసిన సూచనను మెగా అభిమానులు అర్థం చేసుకుని ఈ వివాదానికి ముగింపు పలికుతారని ఆకాంక్షిస్తున్నారు.
గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request.
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 7, 2022