సినీ రంగంలో ఇప్పుడు కాంతార ఒక సెన్సేషన్.. ఏ సినిమా అభిమాని నోట విన్నా ఒక్కటే మాట.. కాంతార. కన్నడలో విడుదలై మౌత్ టాక్‌తో భారీ బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన కాంతార. తెలుగు, హిందీ భాషల్లోకి సైతం డబ్ అయి.. సూపర్ హిట్ అయింది. కన్నడలోనే కాకుండా.. తెలుగులోనూ కాంతార భారీ స్థాయిలో కలెక‌్షన్లు రాబడుతోంది. సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. తెలుగులో రిలీజ్ అయిన తొలిరోజే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటేడం సంచలనంగా మారింది. ఇక ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి ఆయన నటించారు. ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ నటనే అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు బల్లగుద్ది చెబుతున్నారు.
కేజీఎఫ్ లాంటి చరిత్ర తిరగరాసిన చిత్రాలను నిర్మించిన హోంబలే సంస్థ ఈ కాంతారను కూడా ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలై బ్రహ్మాండమైన విజయం సాధించింది. కన్నడలో కలెక‌్షన్ల వర్షం కురిపించింది. కన్నడ వెర్షన్‌ను చూసిన మన అగ్రనిర్మాత అల్లు అరవింద్ వెంటనే దాని తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను కొనుగోలు చేశారు. రూ.2 కోట్లు పెట్టి తెలుగులో కాంతారను గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం తెలుగురాష్ట్రాల్లో కాంతారను విడుదల చేశారు. పెద్దగా ప్రమోషన్లు లేకపోయినా.. తెలుగులోనూ కాంతార బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇప్పటికే ఈ సినిమా తొలి రోజు 2.1 కోట్లతో బ్రేక్ ఈవెన్ దాటేసి.. ఆదివారం మరో 2 కోట్లు వసూలు చేసేసింది. ఇంకా సినిమాపై మౌత్ టాక్‌తో జనాల్లోకి వెళ్తుంది. దీంతో సినిమా కలెక‌్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక తెలుగులోనే కాకుండా హిందీలోనూ కాంతార మంచి కలెక‌్షన్లు రాబడుతోంది. తొలి రోజు కాంతారకు థియేటర్ల దొరకని కారణంగా 1.3 కోట్లు మాత్రమే వచ్చాయి. తొలి రోజు తర్వాత సినిమా అదిరిపోయిందనే టాక్‌తో.. థియేటర్ల సంఖ్యతో పాటు కలెక‌్షన్లు కూడా భారీగా పెరిగాయి. ఇప్పటికే హిందీలో 3.5 కోట్ల కలెక‌్షన్ రాబట్టింది కాంతార. కర్ణాటకలోని కంబ్లా, భూతకోలా సంస్కృతి, సాంప్రదాయం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా కాంతారను రిషబ్ శెట్టి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ రెండు సార్లు చూసినట్లు చెప్పారు. తన సినిమా బాగా నచ్చిందని తెలిపారు.
#KantaraTelugu 😅
AP/TG Day 1 Collection 🔥🔥🔥pic.twitter.com/13aUyTKFxq— Crazy 4 movie (@crazy4movie_yt) October 16, 2022