గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు యాక్షన్ హీరో గోపీచంద్. ఆయన నుంచి తాజాగా వస్తున్న చిత్రం ‘రామబాణం’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తున్నారు. కలెక్షన్లతో పాటు అవార్డులు కూడా వస్తుండటంతో తెలుగు సినిమా మార్కెట్ ఒక రేంజ్‌కు వెళ్లిపోయింది. అయితే ఇప్పటికీ పలువురు హీరోలు సక్సెస్ బాట పట్టాల్సి ఉంది. అలాంటి వారిలో యాక్షన్ హీరో గోపీచంద్ ఒకరు. మాస్ హీరోగా మస్తు ఇమేజ్, పాపులారిటీ ఉన్న ఆయనకు ఈమధ్య సరైన హిట్ పడలేదు. కరెక్టు హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించే సత్తా గోపీచంద్‌కు ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారాయన. ఆయన నటించిన తాజా చిత్రం ‘రామబాణం’. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ ఫిల్మ్.. మే 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
గోపీచంద్‌కు ‘లౌక్యం’, ‘లక్ష్యం’ లాంటి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీవాస్ ‘రామబాణం’ సినిమాను తెరకెక్కించారు. హిట్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్గా విడుదలైన టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ‘రామబాణం’ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఈ సందర్భంగా స్టార్ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ‘సుమ అడ్డా’లో పాల్గొన్నారు మూవీ టీమ్. ఈ షోకు గోపీచంద్, శ్రీవాస్, హీరోయిన్ డింపుల్ హయతి పాల్గొన్నారు. దీనికి సంబంధించి ప్రోమో రిలీజై నెట్టింట్ హల్చల్ చేస్తోంది. ఇందులో గోపీచంద్‌పై సుమ సెటైర్లు వేస్తూ కనిపించారు.
హీరోయిన్ డింపుల్ హయతి అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. అయితే గేమ్ ఆడుతూ మధ్యలో గోపీచంద్ కాస్త వైల్డ్‌గా బిహేవ్ చేశారు. ఒక్కసారిగా యాంకర్ సుమ గొంతును ఆయన పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. భయంతో సుమ బిగుసుకుపోయారు. సుమ గొంతును గోపీచంద్ ఎందుకు పట్టుకున్నారనేది ఏప్రిల్ 29న టెలికాస్ట్ అయ్యే పూర్తి ఎపిసోడ్‌తో తెలిసిపోతుంది. ఇకపోతే, ‘రామబాణం’ చిత్రంలో స్టార్ యాక్టర్ జగపతిబాబు, ప్రముఖ నటులు ఖుష్బూ, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులపై మంచి అంచనాలు నెలకొన్నాయి.