సాధారణంగా సినీ అవార్డుల ప్రదానోత్సవాలలో అభిమాన హీరోలకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఫేవరేట్ హీరోకి అవార్డు రావడాన్ని చిత్రబృందంతో పాటు అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. హీరో గురించి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అనేవి మాములే. కానీ.. తెలుగు హీరో అవార్డు అందుకుంటే స్టార్ క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా విష్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవును.. ఆ క్రికెటర్ ఆస్ట్రేలియా దేశానికి చెందినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో ఆయనకున్న ఫ్యాన్ బేస్ మిలియన్స్ లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఆ క్రికెటర్ ఎవరో ఆల్రెడీ అర్థమైపోయుంటుంది.
అవును.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్.. మన తెలుగు హీరో అల్లు అర్జున్ ఫిలింఫేర్ అవార్డు అందుకోవడాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశాడు. డేవిడ్ వార్నర్ గురించి తెలుగు క్రికెట్ లవర్స్ తో పాటు మూవీ లవర్స్ కి కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో తెలుగు హీరోల డైలాగ్స్ తో వీడియోలు చేసి బాగా దగ్గరయ్యాడు. అదీగాక ఐపీఎల్ జట్టు సన్ రైసర్స్ తో ఉన్న అనుబంధం కారణంగా వార్నర్ కి తెలుగులో అభిమానులు భారీగా ఏర్పడ్డారు. అయితే.. ఇటీవల పుష్ప మూవీ ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ కేటగిరిలన్నీ క్లీన్ స్వీప్ చేయడంతో వార్నర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అల్లు అర్జున్ కి, పుష్ప టీమ్ కి అభినందనలు తెలిపాడు.
ఈ క్రమంలో వార్నర్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో పుష్ప డైలాగ్స్ తో వార్నర్ రీల్స్ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తాను పుష్ప లుక్ లో ఉన్న పిక్ తో, అల్లు అర్జున్ లుక్ జతచేసి విష్ చేశాడు. “ఫిలింఫేర్ అవార్డులలో పుష్ప క్లీన్ స్వీప్ చేయడం, బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. పుష్ప సినిమా అంటే మాకు కూడా ఎంతో ఇష్టం. వెల్ డన్.. పుష్ప సినిమాలో భాగమైన వారందరికీ నా అభినందనలు” అని తన పోస్ట్ లో తెలిపాడు వార్నర్. ఇక పుష్ప సినిమా గురించి వార్నర్ పోస్ట్ పెట్టడంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. మరి చూడాలి వార్నర్ పోస్ట్ పై బన్నీ, పుష్ప టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో!