టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న యువహీరోలలో నాగశౌర్య ఒకరు. ఛలో లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ స్థాయి హిట్ మళ్లీ రాలేదు. మధ్యలో విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేసినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో మరోసారి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి కమర్షియల్ గా సక్సెస్ నమోదు చేసింది. అలా మొత్తానికి ప్లాపుల్లో ఉన్న హీరో నాగశౌర్యకు హిట్ ఇచ్చిన చిత్రంగా కృష్ణ వ్రిందా విహారి నిలిచింది.
ఇక పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో షిర్లే సెటియా హీరోయిన్ గా టాలీవుడ్ డెబ్యూ చేసింది. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ చిత్రాన్ని అనీష్ కృష్ణ తెరకెక్కించారు. 2014లో అలా ఎలా మూవీతో డైరెక్టర్ గా మారిన అనీష్.. ఆ తర్వాత లవర్, గాలి సంపత్ సినిమాలు చేసి నిరాశపరిచాడు. దీంతో రొటీన్ స్టోరీలో కొత్త ట్విస్ట్ జోడించి కామెడీ ఎంటర్టైనర్ గా కృష్ణ వ్రిందా విహారి తెరపైకి తీసుకొచ్చాడు. నాగశౌర్య సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా.. మంచి హిట్ అవ్వడంతో హీరోతో పాటు డైరెక్టర్ ఫామ్ లోకి వచ్చేశారు. ఇదిలా ఉండగా.. కృష్ణ వ్రిందా విహారి ఓటిటి రిలీజ్ కి రెడీ అయినట్లు తెలుస్తుంది.
థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకే ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమవ్వడం గమనార్హం. సెప్టెంబర్ 23న థియేట్రికల్ రిలీజైన కృష్ణ వ్రిందా విహారి చిత్రం.. సరిగ్గా నెల రోజులకు అంటే.. అక్టోబర్ 23న డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా.. రానున్న దీపావళి సందర్భంగా ఓటిటి రిలీస్ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి నెట్ ఫ్లిక్స్ వారు అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. అక్టోబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ లో ఆప్షన్ కనిపిస్తుండటం విశేషం.. మరి థియేటర్స్ కి నవ్వులు పూయించిన ఈ సినిమా.. ఓటిటి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
#PremiereAlert 🔔@IamNagashaurya‘s #KrishnaVrindaVihari will be available for streaming on @NetflixIndia from 23 October. pic.twitter.com/AtSoOIX31f
— Unfiltered Filmy 🍿 (@UnfilteredFilmy) October 12, 2022
Telugu movie #KrishnaVrindaVihari digital arrives October 24 on Netflix. pic.twitter.com/G5JXfJ77nZ
— Ott Updates (@Ott_updates) October 12, 2022