‘గాడ్ ఫాదర్’.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు రీసౌండింగ్ వస్తోంది. అటు కలెక్షన్స్ లోనూ మెగాస్టార్ రేంజ్ ఏంటో చూపిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇది సార్ చిరంజీవి రేంజ్ అనేలా గాడ్ ఫాదర్ సినిమా దూసుకుపోతోంది. మళయాల సూపర్ హిట్ లూసిఫర్ కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. లూసిఫర్ సినిమా చూసిన వారికి కూడా గాడ్ ఫాదర్ సినిమా తెగ నచ్చేస్తోంది. నిజానికి రీమేక్ అయినా ఆ భావన లేకుండా స్క్రీన్ ప్లేలో తెలుగు నేటివీటీ, చిరంజీవికి తగ్గట్లుగా మార్పులు చేశారు. వెరసి సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యే ఒక విషయం ఒకటి వచ్చేసింది.
వాటర్ బాటిళ్లలో బిస్లెరీ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్లు గాడ్ ఫాదర్ థీమ్‌తో లిమిటెడ్ ఎడిషన్ తీసుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిస్లెరీ బాటిళ్లపై చిరంజీవి బొమ్మను ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్- బిస్లెరీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం లిమిటెడ్ ఎడిషన్ ను తీసుకొచ్చారు. అటు మెగా అభిమానులు సైతం గాడ్ ఫాదర్ సినిమాపై వినూత్నంగా చేస్తున్న ప్రచారం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంక కలెక్షన్స్ విషయానికి వస్తే.. గాడ్ ఫాదర్ సినిమా రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.69.12 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల షేర్ని వసూలు చేసింది. ఈ వీకెండ్‌కి గాడ్ ఫాదర్ రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందంటూ ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.
In a world where movies influence and inspire, we are delighted to associate with the much-awaited movie Godfather to launch Godfather limited-edition bottles. The partnership will strengthen brand love amongst our consumers in Andhra Pradesh and Telangana. pic.twitter.com/LzdYmzwAIr
— BisleriZone (@BisleriZone) October 6, 2022
#GodFather Limited Edition #Bisleri Water Bottles !! #GodFatherOnOct5th pic.twitter.com/nIWgxdoBKB
— Gopal Karneedi (@gopal_karneedi) October 4, 2022
చిరంజీవి #GodFather limited Edition by #Bisleri కాదేదీ వ్యాపార ప్రకటనకు , ప్రచారానికీ అనర్హం! , సంబరం తట్టుకోలేక సాంబారు ఎక్కువ లాగించా 🤤 pic.twitter.com/yHaRHReMQh
— Krupal కశ్యప్ (@krupalkasyap) October 5, 2022