‘గాడ్ ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి మాస్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించిన సినిమా. పాన్ ఇండియా లెవల్లో గాడ్ ఫాదర్ గురించే సినిమా అభిమానులు అంతా చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మళయాల సూపర్‌హిట్ లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్వాగ్, గ్రేస్‌తో మెగా అభిమానులకు చిరంజీవి ఫుల్ మీల్స్ పెట్టేశారు. నిజానికి లూసిఫర్ సినిమా చూసిన వారంతా మక్కీకి మక్కీ ఉంటుందేమో.. మనం సినిమాని ఎంజాయ్ చేయలేమేమో అనే అనుమానాలు ఉండేవి. కానీ, దర్శకుడు మోహన్ రాజా తెలుగు నేటివిటీ, టాలీవుడ్ అభిమానుల పల్స్, చిరంజీవి క్రేజ్‌కి తగ్గట్లు స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచేలా చేశాడు.
బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.32 కోట్ల గ్రాస్, రూ.18 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. అదే జోరును రెండోరోజు కూడా కొనసాగించింది. మొత్తం రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.69.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.35 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ వారాంతానికి గాడ్ ఫాదర్ సినిమా కచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందంటూ ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం మెగా అభిమానులు మొత్తం గాడ్ ఫాదర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ సైతం ఈ విజయంపై అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంక సల్మాన్ ఖాన్‌కి కూడా మెగాస్టార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే సినిమా సక్సెస్‌పై శుభాకాంక్షలు కూడా తెలిపారు.
69.12 crores in 2 Days ❤️🔥
HUMONGOUS BLOCKBUSTER #GodFather setting the box office on fire 🔥
Book your tickets now
– https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfatherMegastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman @ProducerNVP pic.twitter.com/yBVyHA5t8D
— Konidela Pro Company (@KonidelaPro) October 7, 2022
ప్రస్తుతం మెగా అభిమానులే కాదు.. సినిమా అభిమానులు సైతం గాడ్ ఫాదర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఎదురుచూపులు ప్రారంభించారు. అయితే అందుకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. గాడ్ ఫాదర్ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. తెలుగు, హిందీ రైట్స్ ని దాదాపు రూ.57 కోట్లకు కొనుగోలు చేసినట్లు నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాకుండా గాడ్ ఫాదర్ ఓటీటీ ఎంట్రీ ఇప్పుడల్లా ఉండదని కూడా టాక్ నడుస్తోంది. సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి గాడ్ ఫాదర్ వస్తుందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలపైన ఎలాంటి అధికారిక ప్రకటన అటు సినిమా బృందం నుంచి గానీ, నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచి గానీ లేదు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే వేయిట్ చేయాల్సిందే.