దసరా వచ్చేసింది. టాలీవుడ్ లో మూడు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’, స్వాతిముత్యం చిత్రాలు ఉన్నాయి. దసరా రోజు అంటే అక్టోబరు 5న ఒకేసారి థియేటర్స్ విడుదలయ్యాయి. హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీనితోపాటు ఓటీటీలోనూ కార్తికేయ 2, దర్జా లాంటి మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రేపు ఏకంగా 23 ఓటీటీ సిరీసులు ప్లస్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఇవి స్ట్రీమింగ్ కానున్నాయి.
ఇక ఇప్పుడు చెప్పబోయే లిస్టులో కొన్ని సినిమాలు ఈరోజే అంటే అక్టోబరు 6న స్ట్రీమింగ్ లోకి వచ్చేయగా, మరికొన్ని మాత్రం రేపు అంటే అక్టోబరు 7న పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఇక థియేటర్స్ లో మిస్సయిన ప్రేక్షకులు.. ఇంట్లోని టీవీ లేదంటే మొబైల్లో ఈ సినిమాల్ని చూసుకోవచ్చు. కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత తొలుత థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గింది కానీ.. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా చక్కదిద్దుకోవడంతో అటు థియేటర్లకు వెళ్తున్నారు. అది కుదరిని పక్షంలో ఓటీటీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు జాబితా
నెట్ ఫ్లిక్స్:
అమెజాన్ ప్రైమ్:
డిస్నీ ప్లస్ హట్ స్టార్:
లైన్స్ గేట్ ప్లే:
ఇక శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ వచ్చే సోమవారం అంటే అక్టోబరు 10 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు కార్తికేయ 2, ఉనికి, దర్జా, ఈషో(మలయాళం) తదితర సినిమాలు దసరా కానుకగా ఓటీటీలోకి వచ్చేశాయి. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. మరి మీరు ఏ సినిమా చూస్తున్నారు లేదంటే చూడటానికి రెడీ అవుతున్నారు.